న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన, విజయవంతమైన వ్యాపారవేత్తలు!
న్యూమరాలజీ ఆధారంగా మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని బలాలు ఉంటే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అవే బలహీనతలు కావచ్చు. ఈ రోజు నెంబర్ 5 వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని బలాలు ఉంటే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అవే బలహీనతలు కావచ్చు.

సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే, ఒక్కో సంఖ్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తం ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవచ్చు. ఈ రోజు సంఖ్యాశాస్త్రం ప్రకారం రాడిక్స్ నెంబర్ 5 వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
రాడిక్స్ నెంబర్ 5:
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు తెలివైన, చురుకైన మరియు వేగంగా కదిలే గ్రహంగా భావిస్తారు. రాడిక్స్ సంఖ్య 5 వారు ఎప్పుడూ కూడా తెలివైనవారు, చురుకుగా ఉంటారు. జీవితంలో ముందుకు సాగడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
వీరు ధైర్యవంతులు, కష్టపడి పని చేస్తారు
రాడిక్స్ సంఖ్య 5 ఉన్న వారు ఎప్పుడూ కష్టపడి పని చేస్తారు. వీరిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. సవాళ్లను స్వీకరిస్తారు, వాటితో పోరాడుతారు, గెలుస్తారు. బుధ గ్రహం శుభప్రభావం కారణంగా ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి వ్యాపారవేత్తలుగా మారతారు. పేరు, ప్రఖ్యాతులను కూడా సంపాదిస్తారు.
మాటలతో ఆకట్టుకునే లక్షణం వీరిలో ఎక్కువగా ఉంటుంది
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరినైనా తమ మాటలతో సులువుగా ఆకట్టుకుంటారు. వీరికి స్నేహపూర్వక స్వభావం ఉంటుంది. అందువల్ల వీరు ఎక్కడికి వెళ్లినా ఇతరులతో సులువుగా కలిసిపోతారు. అలాగే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మంచి నిర్ణయాలను తీసుకుంటారు. వీరి నిర్ణయాలు ఇంచుమించు సరైనవే అయి ఉంటాయి.
ఈ రంగాల్లో బాగా రాణిస్తారు:
రాడిక్స్ సంఖ్య 5 ఉన్న వారు బిజినెస్, జర్నలిజం, మార్కెటింగ్, రైటింగ్ లేదా కమ్యూనికేషన్ రంగాలలో విజయవంతులవుతారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఎప్పుడూ కొత్తదనాన్ని ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు ఒకే చోట ఉండటానికి ఇష్టపడరు. ప్రయాణం చేయడానికి, ప్రజలను కలుసుకోవడానికి, కొత్త ప్రదేశాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
విద్య విషయానికి వస్తే, రాడిక్స్ సంఖ్య 5 ఉన్న వారు మంచి విద్యను పొందుతారు. అనేక భాషల్లో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. తెలివైనవారిగా పేరు తెచ్చుకుంటారు. మత గ్రంథాల పట్ల కూడా వీరికి మంచి అవగాహన ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


