న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది.. ఏదైనా సరే పట్టుదలతో సాధించేస్తారు!
న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. పట్టుదలతో సాధించేస్తారు.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని బలాలు ఉంటే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి బలహీనతలు కావచ్చు. చాలా మందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు.

ప్రత్యేక శక్తి ఉంటుంది
ఈ తేదీల్లో పుట్టిన వారికైతే సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఏదైనా సరే పట్టుదలతో సాధిస్తారు. మరి ఎవరు ఇలాంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నారు? ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు? మరి మీకు కూడా స్పెషల్ పవర్స్ ఉన్నాయా? ఇప్పుడే పూర్తి వివరాలను చూసేయండి.
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది.. ఏదైనా సరే పట్టుదలతో సాధించేస్తారు
రాడిక్స్ నెంబర్ 1
న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఒకటి అవుతుంది. రాడిక్స్ సంఖ్యకు అధిపతి సూర్యుడు.
సూర్య ప్రభావం
సూర్యుడి ప్రభావంతో ఈ తేదీల్లో పుట్టిన వారు అన్నింట్లో ముందుంటారు. ఎదురుదాడులు, సమస్యలు ఏవైనా సరే ఎదుర్కోగలరు. ఇది వీరి బలం అని చెప్పొచ్చు. సూర్యుడి ప్రభావంతో ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు.
జీవిత పాఠాలను బాగా నేర్చుకుంటారు
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా చదువుపై ఆసక్తి చూపించకపోయినా, జీవిత పాఠాలను మాత్రం అద్భుతంగా నేర్చుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంపై స్పష్టతతో ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా బాగా రాణించగలరు.
సూర్యుని ప్రభావం వలన ఈ తేదీల్లో పుట్టిన వారికి సమాజంలో గౌరవం, మర్యాదలు బాగా దక్కుతాయి. వారి కృషితో సమాజంలో గుర్తింపును పొందుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆత్మగౌరవం కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది.
తొందర పడరు
ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఈ తేదీల్లో పుట్టిన వారు అస్సలు తొందర పడరు. ముందుగా బాగా ఆలోచించి, ఆ తర్వాత సరైన దారిలో వెళ్తారు. నిర్ణయం తీసుకున్న తర్వాత గట్టిగా దానినే ఫాలో అవుతారు. అంతే కానీ మధ్యలో వెనక్కి వెళ్లిపోవడం వంటి విషయాలు వీరికి తెలియవు.
అలాగే జీవితంలో స్థిరత్వాన్ని నిలుపుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే పట్టుదలతో సాధిస్తారు. అసలు భయపడరు. చాలా మందిలా మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు. పట్టుదలతో సాధించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


