న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని బలాలు ఉంటే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అవే బలహీనతలు కావచ్చు.

సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే, ఒక్కో సంఖ్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తం ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవచ్చు. ఈ రోజు సంఖ్యాశాస్త్రం ప్రకారం రాడిక్స్ నెంబర్ 5 వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
రాడిక్స్ నెంబర్ 5:
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు తెలివైన, చురుకైన మరియు వేగంగా కదిలే గ్రహంగా భావిస్తారు. రాడిక్స్ సంఖ్య 5 వారు ఎప్పుడూ కూడా తెలివైనవారు, చురుకుగా ఉంటారు. జీవితంలో ముందుకు సాగడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
వీరు ధైర్యవంతులు, కష్టపడి పని చేస్తారు
రాడిక్స్ సంఖ్య 5 ఉన్న వారు ఎప్పుడూ కష్టపడి పని చేస్తారు. వీరిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. సవాళ్లను స్వీకరిస్తారు, వాటితో పోరాడుతారు, గెలుస్తారు. బుధ గ్రహం శుభప్రభావం కారణంగా ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి వ్యాపారవేత్తలుగా మారతారు. పేరు, ప్రఖ్యాతులను కూడా సంపాదిస్తారు.
మాటలతో ఆకట్టుకునే లక్షణం వీరిలో ఎక్కువగా ఉంటుంది
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరినైనా తమ మాటలతో సులువుగా ఆకట్టుకుంటారు. వీరికి స్నేహపూర్వక స్వభావం ఉంటుంది. అందువల్ల వీరు ఎక్కడికి వెళ్లినా ఇతరులతో సులువుగా కలిసిపోతారు. అలాగే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మంచి నిర్ణయాలను తీసుకుంటారు. వీరి నిర్ణయాలు ఇంచుమించు సరైనవే అయి ఉంటాయి.
ఈ రంగాల్లో బాగా రాణిస్తారు:
{{/usCountry}}ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరినైనా తమ మాటలతో సులువుగా ఆకట్టుకుంటారు. వీరికి స్నేహపూర్వక స్వభావం ఉంటుంది. అందువల్ల వీరు ఎక్కడికి వెళ్లినా ఇతరులతో సులువుగా కలిసిపోతారు. అలాగే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మంచి నిర్ణయాలను తీసుకుంటారు. వీరి నిర్ణయాలు ఇంచుమించు సరైనవే అయి ఉంటాయి.
ఈ రంగాల్లో బాగా రాణిస్తారు:
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య 5 ఉన్న వారు బిజినెస్, జర్నలిజం, మార్కెటింగ్, రైటింగ్ లేదా కమ్యూనికేషన్ రంగాలలో విజయవంతులవుతారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఎప్పుడూ కొత్తదనాన్ని ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు ఒకే చోట ఉండటానికి ఇష్టపడరు. ప్రయాణం చేయడానికి, ప్రజలను కలుసుకోవడానికి, కొత్త ప్రదేశాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
విద్య విషయానికి వస్తే, రాడిక్స్ సంఖ్య 5 ఉన్న వారు మంచి విద్యను పొందుతారు. అనేక భాషల్లో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. తెలివైనవారిగా పేరు తెచ్చుకుంటారు. మత గ్రంథాల పట్ల కూడా వీరికి మంచి అవగాహన ఉంటుంది.