న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు.

కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే నిజానికి ప్రతి సంఖ్యకూ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. 2026 వచ్చేసింది. అప్పుడే ఒక వారం కూడా పూర్తయిపోయింది. 2026లో కొన్ని సంఖ్యల వారికి ఎక్కువ లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ సంఖ్యల వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
సూర్యుడితో ముడిపడి ఉన్న 2026
ఇది సూర్య సంవత్సరం. శని, గురు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడంతో కొన్ని లాభాలు కలుగుతాయి. ఈ సంఖ్యల వారికే ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఆ అదృష్ట సంఖ్యలు ఎవరు? మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.
ఈ సంఖ్యల వారికి 2026లో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం
కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఏ పని ప్రారంభించినా కూడా ఆటంకాలు ఉండవు. శ్రద్ధ కూడా ఎక్కువ అవుతుంది. చదువుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
1, 10 తేదీల్లో పుట్టిన వారు
ఏదైనా నెలలో 1, 10 తేదీల్లో పుట్టిన వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం కనపడుతోంది. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారొచ్చు. నిరంతరం కష్టపడి శ్రమించినట్లయితే కచ్చితంగా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది.
4, 22 తేదీల్లో పుట్టిన వారు
{{/usCountry}}ఏదైనా నెలలో 1, 10 తేదీల్లో పుట్టిన వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం కనపడుతోంది. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారొచ్చు. నిరంతరం కష్టపడి శ్రమించినట్లయితే కచ్చితంగా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది.
4, 22 తేదీల్లో పుట్టిన వారు
{{/usCountry}}ఏదైనా నెలలో 4, 22 తేదీల్లో పుట్టినట్లయితే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తేదీల్లో పుట్టిన వారికి రాహువు అనుగ్రహం ఉంటుంది. అందుకని ఏ పనిని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే శ్రద్ధ పెరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు. భిన్నంగా ఆలోచిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు.
28, 13, 19 తేదీల్లో పుట్టిన వారు
ఏదైనా నెలలో 28, 13, 19 తేదీల్లో పుట్టినట్లయితే వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కష్టపడి ట్రై చేస్తే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. 13, 19 తేదీల వారిపై శని, సూర్య గ్రహాల అనుకూల దృష్టి ఉంటుంది. దీంతో కలిసి వస్తుంది. అలాగే 28న పుట్టిన వారికి గురువు అనుకూలంగా ఉంటుంది. దీంతో కష్టపడితే ఎక్కువ త్వరగా విజయం లభిస్తుంది. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు కొంచెం కష్టపడితే, గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.