...
...
Next Story

న్యూమరాలజీ: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో పడటానికి చాలా టైం తీసుకుంటారు!

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీలోని అంకెలను కలిపి మూలాంకం తెలుసుకోవచ్చు. కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తులు ప్రేమ విషయంలో తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా, ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సంబంధంలోకి అడుగుపెడతారని నమ్ముతారు.

Published on: Sep 10, 2026, 16:00:21 IST
Advertisement

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకం కూడా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే వచ్చే సంఖ్యనే మూలాంకం అని అంటారు.

న్యూమరాలజీ: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో పడటానికి చాలా టైం తీసుకుంటారు! (AI)
న్యూమరాలజీ: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో పడటానికి చాలా టైం తీసుకుంటారు! (AI)

న్యూమరాలజీ ప్రకారం కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తులు ప్రేమ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తొందరగా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిపోరు. ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారి ప్రేమకు ఒప్పుకుంటారు. ప్రేమలో పడడానికి, మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఈ తేదీల్లో పుట్టిన వారికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ సమయం ప్రేమ విషయంలో తీసుకుంటారు? మీరు వీరిలో ఒకరేమో చూసుకోండి.

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు అంత ఈజీగా ప్రేమలో పడరు.. చాలా టైం పడుతుంది

మూలాంకం 7

ఏదైనా నెలలో 7, 16, 25వ తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం ఏడు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ వ్యక్తులు ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. అంత ఈజీగా ఎవరినీ నమ్మరు. ప్రేమ విషయంలో అందుకే అంత త్వరగా ముందుకు వెళ్లడానికి ఇష్ట పడరు. ఈ తేదీల్లో పుట్టిన వారి స్వభావం, ఆలోచనా విధానం, ప్రవర్తన గమనించి, వేరుగా ఉంటుంది. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రేమలో పడతారు.

మూలాంకం 8

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం ఒకటి అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. పుట్టిన వారు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రేమ విషయంలో ఈ తేదీల్లో పుట్టిన వారు అంత సులభంగా ముందుకు వెళ్లరు. అన్ని కోణాల్లో అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్తారు. తప్ప అంత ఈజీగా ఎవరినీ నమ్మరు. ఎదుటివారు తమ జీవితానికి సరైన భాగస్వామి అవుతారా అనే విషయాన్ని ఆలోచించాకనే నిర్ణయం తీసుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks