సంఖ్యాశాస్త్రం ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. సంఖ్యల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. సంఖ్యల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. కొన్ని సంఖ్యల వారిలో ఉండే లక్షణాలు స్పెషల్‌గా ఉంటే, మరికొంతమందికి అవే బలహీనతలు అవ్వచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే కింగ్‌లా బతుకుతారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
మూలంకం 1

ఒకటి సంఖ్యకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఒకటి సంఖ్యలో ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే పుట్టిన తేదీ 1 అయితే వారు కచ్చితంగా ఒకటవ స్థానంలో ఉండగలరు. ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలంకం 1 అవుతుంది.
జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. అందుకే వీరికి సూర్యుడు లాంటి తేజస్సు, రాజసం ఉట్టిపడే వ్యక్తిత్వం అలవడుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరి ఆధీనంలో ఉండడానికి ఇష్టపడరు. స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. పైగా కింగ్‌లా బతుకుతారు.
ప్రపంచాన్ని జయించే మూడు అద్భుత లక్షణాలు
1.అలుపెరగని కృషి
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, దానిని సాధించేవరకు కనీసం నిద్రపోరు. గొప్పలు చెప్పడం కంటే కష్టపడి పని చేయడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా వెనుకడుగు వేయరు.
2.సహజ నాయకత్వ లక్షణాలు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సహజ నాయకత్వ లక్షణాలు ఎక్కువ. రిస్క్ తీసుకోవడానికి కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు ఏమాత్రం భయపడరు. ఈ లక్షణమే వీరిని ఇతరుల కంటే ముందువరుసలో నిలబెడుతుంది.
3.స్వేచ్చా ప్రియులు
ఇతరుల ఒత్తిడిలో పని చేయడం వీరికి నచ్చదు. సరైన నిర్ణయాలు స్వయంగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని అనుకుంటారు.
కెరీర్లో ఉన్నతంగా
{{/usCountry}}ఇతరుల ఒత్తిడిలో పని చేయడం వీరికి నచ్చదు. సరైన నిర్ణయాలు స్వయంగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని అనుకుంటారు.
కెరీర్లో ఉన్నతంగా
{{/usCountry}}నాయకత్వ లక్షణాలు, రిస్క్ తీసుకునే గుణం ఉండడంతో ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి హోదాను అందుకుంటారు. వీరి పనితీరు, నిర్ణయాత్మక శక్తి మంచి గుర్తింపును తీసుకొస్తుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా బాగా రాణించగలరు. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చూపించే చొరవ సహచరులకు స్ఫూర్తిని అందిస్తుంది.
ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.