సంఖ్యా శాస్త్రంలో (Numerology) మనిషి పుట్టిన తేదీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఒక వ్యక్తి జన్మించిన తేదీ అతని స్వభావం, కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా సంఖ్యా శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం కొన్ని ప్రత్యేక మూలాoకాలకు చెందిన వారికి వివాహం కాస్త ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే వీరికి పెళ్లి లేటవుతుంది. సరైన భాగస్వామి దొరికిన తర్వాత జీవితాంతం వారి చెంతే ఉంటూ అండగా నిలుస్తారు. ఆ ప్రత్యేక మూలాoకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూలంకం 4: ఆచూకీ, స్పష్టత ముఖ్యం

ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వారి మూలాoకం 4 అవుతుంది. ఈ సంఖ్యకు రాహువు ఆధిపత్యం ఉంటుంది. ఈ సంఖ్యకు చెందిన వారు తమ జీవిత లక్ష్యాల విషయంలో చాలా స్పష్టతతో, ప్రాక్టికల్ ధోరణితో వ్యవహరిస్తారు. అయితే ఎవరిపైనా తొందరపడి గుడ్డిగా నమ్మకం ఉంచలేరు. వివాహ విషయానికి వస్తే అస్సలు తొందరపడరు. కాబోయే భాగస్వామిని అన్ని విధాల అర్థం చేసుకున్న తర్వాతే వివాహంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ కారణం వల్లే మూలాoకం 4 వారికి పెళ్లి ఆలస్యమవుతుంది. ఒకసారి తమకు సరిపోయే వ్యక్తి దొరికితే మాత్రం జీవితాంతం వారి చేయి విడువకుండా అండగా ఉంటారు.
మూలంకం 7: ఓవర్‌థింకింగ్, ఆదర్శ భావాలు
ఏ నెలలోనైనా 7, 16 లేదా 25 తేదీలలో పుట్టిన జాతకుల మూలంకం 7 కింద వస్తుంది. కేతువు ఈ సంఖ్యకు అధిపతిగా ఉంటారు. ఈ మూలకం సాధారణంగా చాలా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ఏ విషయాన్నయినా చాలా లోతుగా ఆలోచించే గుణం వీరి సొంతం. అయితే కొన్నిసార్లు చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే (Overthinking) నైజాం ఉంటుంది.
రిలేషన్షిప్ విషయంలో వీరు త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు. అవతలి వ్యక్తిని పూర్తిగా అంచనా వేయడానికి చాలా సమయం తీసుకుంటారు. తమ జీవిత భాగస్వామి కేవలం లైఫ్ పార్టనర్ మాదిరి కాకుండా మంచి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటారు. సరైన వ్యక్తి కోసం వెతికే క్రమంలోనే వీరికి వివాహం ఆలస్యం అవుతుంది.
మూలంకం 8: కెరీర్ స్థిరత్వమే ముఖ్యం
{{/usCountry}}రిలేషన్షిప్ విషయంలో వీరు త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు. అవతలి వ్యక్తిని పూర్తిగా అంచనా వేయడానికి చాలా సమయం తీసుకుంటారు. తమ జీవిత భాగస్వామి కేవలం లైఫ్ పార్టనర్ మాదిరి కాకుండా మంచి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటారు. సరైన వ్యక్తి కోసం వెతికే క్రమంలోనే వీరికి వివాహం ఆలస్యం అవుతుంది.
మూలంకం 8: కెరీర్ స్థిరత్వమే ముఖ్యం
{{/usCountry}}సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెటనైనా 8, 17 లేదా 26 తేదీలలో జన్మించిన వారి మూలాoకం 8 అవుతుంది. శని భగవానుడు ఈ సంఖ్యకు కారకుడు. జ్యోతిష్య శాస్త్రంలో శని అంటేనే ధైర్యం, నిలకడ, కాస్త నెమ్మదైన ప్రక్రియగా చెబుతారు. అందుకే ఈ మూలంకంలో పుట్టిన వారి జీవితంలో ఏ ఘట్టమైనా తగిన సమయం తీసుకునే పూర్తవుతుంది.
పెళ్లి విషయంలో వీరు చాలా సీరియస్‌గా, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. మొదట తమ వృత్తి జీవితంపై పూర్తి దృష్టి పెడతారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే వివాహం గురించి ఆలోచిస్తారు. సరైన భాగస్వామి దొరికిన తర్వాత ప్రతి అడుగులోనూ వారిని అంటిపెట్టుకుని సపోర్ట్‌గా నిలుస్తారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.