తెలుగు పంచాంగం ప్రకారం అక్టోబర్ 13 మంగళవారం దసరా నవరాత్రులలో మూడవ రోజు. మంగళవారం రోజు సంకట మోచనుడైన హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భయాలు తొలగిపోయి, జీవితంలో సానుకూలత వస్తుందని నమ్ముతారు. రేపటి రోజున గ్రహ నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ఏయే రాశుల వారికి అదృష్టం వరించనుంది, ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలనే పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
మేష రాశి

మేష రాశి జాతకులకు ఈరోజు అంచనాలకు మించి సానుకూలంగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం కుదిరిన ఒక డీల్ లేదా ఒప్పందం ద్వారా ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇళ్లలో కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దృష్టి పెట్టండి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి తగిన అవకాశాలు తలుపు తడతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ప్రేమ జీవితంలో ఇన్నాళ్లుగా ఉన్న అపార్థాలు తొలగిపోయి మనస్పూర్తైన బంధం బలపడుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో కీలకమైన ప్రాజెక్టు బాధ్యతలు మీ భుజస్కంధాలపై పడతాయి.
మిథున రాశి
ఈ రాశి వారు ఈరోజు 'సెల్ఫ్ లవ్' పై దృష్టి పెట్టడం మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించిన స్థాయిలో రిటర్న్స్ రాకపోవచ్చు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి యోగా చేయడం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి మాత్రం నిలకడగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి కార్యక్షేత్రంలో శ్రమ పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో భాగస్వామితో గడిపే సమయం ఎంతో రొమాంటిక్‌గా సాగిపోతుంది. ఒత్తిడి అనిపించినప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి.
సింహ రాశి
సింహ రాశి ఉద్యోగస్తులు తమ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే ఎలాంటి కష్టాలనైనా సులభంగా ఎదుర్కొంటారు. ఆఫీసులో అదనపు బాధ్యతలు వస్తాయని భయపడకుండా బాధ్యతగా పూర్తి చేయండి.
కన్య రాశి
{{/usCountry}}సింహ రాశి ఉద్యోగస్తులు తమ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే ఎలాంటి కష్టాలనైనా సులభంగా ఎదుర్కొంటారు. ఆఫీసులో అదనపు బాధ్యతలు వస్తాయని భయపడకుండా బాధ్యతగా పూర్తి చేయండి.
కన్య రాశి
{{/usCountry}}ఈ రాశి వారు అనవసర ఖర్చులకు ముకుతాడు వేయాల్సిన సమయం ఇది. వ్యాపారం, ఆరోగ్యం, ధనం లేదా ప్రేమ జీవితం.. ఇలా ఏ రంగంలోనైనా పెద్ద మార్పులకు సిద్ధం కావాలి. కొత్త జీవితాన్ని మనసారా స్వాగతించండి.
తులా రాశి
ఈ రాశి వారికి ఈరోజు కొద్దిగా బద్ధకం ఆవహించవచ్చు. ఆఫీసు రాజకీయాల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు కాబట్టి అనవసరమైన గాసిప్‌లకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశి జాతకులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరైన వ్యూహాన్ని రచించడం చాలా అవసరం. పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల పై అధికారుల నుంచి చిన్నపాటి అసంతృప్తి ఎదురయ్యే సూచనలున్నాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా అదృష్టం పూర్తిగా వెంటే ఉంటుంది. వృత్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరైన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగండి. జీవితంలో ఊహించని మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
మకర రాశి
మకర రాశి జాతకులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన రొమాంటిక్ డేట్ ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. వృత్తిరీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది.
కుంభ రాశి
ఈ రాశి వారిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎనర్జిటిక్‌గా ఉంటూ వినూత్న ఆలోచనలపై దృష్టి పెడతారు. ఆర్థికంగా ధన ప్రవాహం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు మరింత బలపడతాయి.
మీన రాశి
ఈ రాశి వారు దూర ప్రాంతాల్లో లేదా సుదూర సంబంధాల్లో ఉన్నవారికి ప్రేమ జీవితంలో చిన్నపాటి సవాళ్లు ఎదురుకావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే జాగ్రత్త పడండి.