ఈరోజే సరస్వతీ పూజ.. విద్యార్థులు తప్పక చదవాల్సిన మంత్రాలు, స్తోత్రాలు ఇవే!
దసరా నవరాత్రుల్లో సరస్వతీ దేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని పూజించడం సంప్రదాయంగా భావిస్తారు. విద్య, జ్ఞానం, వివేకం, వాక్పటిమకు ప్రతీక అయిన సరస్వతీ దేవిని విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ఆరాధించి ప్రార్థిస్తారు.
దసరా నవరాత్రుల్లో సరస్వతీ దేవిని పూజిస్తాము. నవరాత్రుల్లో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. విద్యార్థులు సరస్వతీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన చదువులో బాగా రాణించడానికి వీలవుతుంది.

అయితే, నేడు నవరాత్రుల్లో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవిని ఆరాధించాలి. విద్యార్థులు చదువులో ఏకాగ్రత, జ్ఞానం పొందడానికి, జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసుకోవడానికి అమ్మవారిని ఆరాధిస్తారు. అయితే, అమ్మవారిని పూజించేటప్పుడు కచ్చితంగా ఈ మంత్రాలు, స్తోత్రాలు చదివేటట్టు చూసుకోండి.
సరస్వతీ దేవి పూజ ఎలా చెయ్యాలి.. ఇలా పిల్లలు కూడా సులువుగా చేసుకోవచ్చు
ముందుగా గణపతి పూజ చేసి, ఆ తర్వాత సరస్వతీ దేవిని కూడా ఆరాధించండి.
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః.. ఇలా అష్టోత్తరం (108 నామాలను) చదువుతూ సరస్వతీ దేవికి పుష్పాలు, అక్షింతలు, పసుపు, కుంకుమలను సమర్పించండి. తర్వాత అమ్మవారికి సంబంధించిన ఈ శ్లోకాలు కూడా చదువుకోండి.
అలాగే కొన్ని మంత్రాలను జపిస్తే సరస్వతీ దేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. దీప, ధూప, నైవేద్యాలతో సరస్వతీ దేవిని ఈ సరస్వతీ అలంకరణ వేళ పూజించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
ఈ మంత్రాలు, శ్లోకాలను సరస్వతీ అనుగ్రహం కోసం చదువుకోండి
సరస్వతి మహాభాగే విద్యే కమలలోచనే
విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే..
యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్ దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేషజాడ్యాపహా..
ఓం ఐం సరస్వత్యై నమః
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా..
శ్రీ సరస్వతీ స్తోత్రం
నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే
యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ
నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్
భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః
వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ
బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః
యయా వినా జగత్ సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః
యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః
ఇతి శ్రీ శారదా ప్రార్థన సమాప్తం
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


