...
...
Next Story

Office Bags Vastu: ఈ వస్తువులను మీ ఆఫీస్ బ్యాగ్‌లో పెడుతున్నారా? ఈ తప్పులు చేయకండి, ప్రతికూల శక్తితో బాధ పడాలి!

వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా దూరంగా ఉండడానికి వీలవుతుంది. అయితే, వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం పాటించడం మంచిది. అలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు రావు.

Published on: Jan 22, 2026, 12:00:24 IST
Advertisement

వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా దూరంగా ఉండడానికి వీలవుతుంది. అయితే, వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం పాటించడం మంచిది. అలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు రావు.

వాస్తు శాస్త్రం

Office Bags Vastu: ఈ వస్తువులను మీ ఆఫీస్ బ్యాగ్‌లో పెడుతున్నారా? (pinterest)
Office Bags Vastu: ఈ వస్తువులను మీ ఆఫీస్ బ్యాగ్‌లో పెడుతున్నారా? (pinterest)

వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ బ్యాగ్ విషయంలోనే వాస్తు నియమాలను పాటించడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ బ్యాగ్‌లో కొన్ని వస్తువులను పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. అలా చేసినట్లయితే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

సానుకూల శక్తి దూరమవుతుంది. ఇబ్బందులు కూడా ఎదురవచ్చు. మరి వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులను ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టకూడదు? ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పొరపాటున కూడా ఆఫీస్ బ్యాగ్‌లో ఈ వస్తువులను పెట్టకండి

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆఫీస్ బ్యాగ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆఫీస్ బ్యాగ్‌ను శుభ్రం చేయడం చాలా అవసరం.

అలాగే పాత, పనికిరాని బిల్లులు, కాగితాలు, పనికిరాని టికెట్లు, అనవసరమైన కాగితాలు వంటివి పెట్టకూడదు. అలా చేయడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

ఇలాంటి కాగితాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఏకాగ్రతను కోల్పోతాము.

ఆఫీస్ బ్యాగ్‌లో పదునైన వస్తువులను పెట్టడం మంచిది కాదు. వాటి వలన సానుకూల శక్తి తొలగి ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

ఆఫీస్ బ్యాగ్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అవసరమైనవే ఉండాలి. వాటిని సరిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి కలుగుతుంది.

ఈ నియమాలను కూడా పాటించండి

  1. ఆఫీస్ బ్యాగ్ విషయంలో ఈ నియమాలను పాటించడం చాలా మంచిది. చాలామంది పనికిరాని పెన్నులు వంటివి పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. కేవలం ఉపయోగంలో ఉన్న వాటినే పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆఫీస్ బ్యాగ్‌ను ఖాళీ చేస్తూ, శుభ్రం చేస్తూ ఉండాలి. అనవసరంగా పనికిరాని వస్తువులతో నింపడం ఏమాత్రం మంచిది కాదు.
  2. పనికిరాని చార్జర్లు, పనికిరాని హెడ్‌ఫోన్లు, పనికిరాని గ్యాడ్జెట్లు వంటివి ఎప్పటికప్పుడు తొలగిస్తేనే మంచిది. వాటి వలన కూడా ప్రతికూల శక్తి పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయి.
  3. ఒకవేళ ఆఫీస్ బ్యాగ్‌లో బరువు ఎక్కువైపోయినా, అనవసరంగా ఎక్కువ సామాన్లు తీసుకెళ్లాల్సి వస్తున్నా, వాటిని జాగ్రత్తగా ఆఫీస్‌లోని కబోర్డ్‌లో పెట్టుకోవాలి. ఇలా ఈ నియమాలను పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆనందంగా ఉండవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks