Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు ఎటు వైపు ఉంటే మంచిది? చాలా మంది చేసే పొరపాట్లు ఇవే!
వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి పూర్తిగా మాయమవుతుంది. అయితే మీరు కూడా ఇంట్లో వాస్తు నియమాలని పాటిస్తారా? చీపురుని కూడా ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.
చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి పూర్తిగా మాయమవుతుంది. అయితే మీరు కూడా ఇంట్లో వాస్తు నియమాలని పాటిస్తారా? చీపురుని కూడా ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.

ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచితే ఎంతో మంచి జరుగుతుంది. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండడానికి కూడా వీలవుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను ఉంచడం వలన ఆనందం, శ్రేయస్సు కూడా కలుగుతాయి. అలాగే ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును కూడా వాస్తు ప్రకారం ఉంచాలి. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చీపురు లక్ష్మీదేవి
చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే చీపురుని కాళ్లతో తొక్కడం వంటివి చేయరు. అయితే చీపురును సరైన దిశలో పెట్టేటట్లు చూసుకోవాలి. లేకపోతే పేదరికం మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు ఎటువైపు ఉంటే మంచిది?
ఇంట్లో చీపురుని దక్షిణ దిశలో పెట్టండి. అలా కుదరని పక్షంలో పడమర లేదా నైరుతి వైపు పెట్టవచ్చు. చీపురును కొనుగోలు చేసేటప్పుడు మంగళవారం లేదా శుక్రవారం నాడు కొనుగోలు చేస్తే మంచిది.
ఈ తప్పులు చేయకూడదు
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చాలా మంది చీపురు పెడుతూ ఉంటారు. అయితే ఇంటికి ఎదురుగా చీపురుని పడేయడం వంటివి చేయకూడదు. అలా చేస్తే ప్రతికూల శక్తి కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు. చీపురుని పెట్టేటప్పుడు తలకిందులుగా ఉంచకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లుగా అవుతుంది, డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పైన చెప్పిన దిశల్లో చీపురుని ఉంచడం వలన ఖర్చులు తగ్గుతాయి, శుభ శక్తి కూడా ఉంటుంది.
చీపురును బెడ్ రూమ్‌లో, వంట గదిలో పెట్టకూడదు. బెడ్ రూమ్ విశ్రాంతికి, మనశ్శాంతికి సంబంధించిన చోటు కాబట్టి బెడ్ రూమ్‌లో చీపురుని ఉంచడం మంచిది కాదు. వంట గదిలో కూడా చీపురును ఉంచడం వలన ఇబ్బందులు వస్తాయి. చీపురు పాడైనప్పుడు మాత్రమే కొత్త చీపురును కొనాలి. అప్పటివరకు కొత్త చీపురును కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


