2026 సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు వీటిని ఇంటికి తీసుకురండి.. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి!

2026 రాబోతోంది. అందరూ కొత్త సంవత్సరం బాగుండాలని, అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ ఉంటారు. మీకు కూడా కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటున్నారా? డబ్బు, ఆర్థిక ఇబ్బందులు, దురదృష్టం వంటి సమస్యలు లేకుండా సానుకూల శక్తి ప్రవహించాలంటే వీటిని ఇంటికి తీసుకురావడం మంచిది.

Published on: Dec 15, 2025, 15:00:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. 2026 రాబోతోంది. అందరూ కొత్త సంవత్సరం బాగుండాలని, అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ ఉంటారు. మీకు కూడా కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటున్నారా? డబ్బు, ఆర్థిక ఇబ్బందులు, దురదృష్టం వంటి సమస్యలు లేకుండా సానుకూల శక్తి ప్రవహించాలంటే కొత్త సంవత్సరం రాకముందే వీటిని ఇంటికి తీసుకురావడం మంచిది. వీటిని మీరు మీ ఇంటికి తీసుకువచ్చినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. విజయాలను కూడా అందుకోవచ్చు.

2026 రాక ముందు వీటిని మీ ఇంట్లో పెట్టండి.. ఇక అదృష్టం కలిసి వస్తుంది (pinterest)
2026 రాక ముందు వీటిని మీ ఇంట్లో పెట్టండి.. ఇక అదృష్టం కలిసి వస్తుంది (pinterest)

ఈ ముఖ్యమైన వస్తువులు సూర్యుడితో అనుసంధానం కలిగి ఉంటాయి. 2026 సూర్యుని సంవత్సరం కాబట్టి వీటిని మీరు మీ ఇంటికి తీసుకు రావడం చాలా శుభప్రదం. వీటిని ఇంటికి తేవడం వలన పేరు, ప్రతిష్టలు కలుగుతాయి. సక్సెస్‌ను అందుకోవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మరి 2026లో వేటిని ఇంటికి తీసుకొస్తే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2026 రాక ముందు వీటిని మీ ఇంట్లో పెట్టండి.. ఇక అదృష్టం కలిసి వస్తుంది

1.రాగి సూర్యుడు

రాగి సూర్యుడుతో సంబంధం కలిగి ఉంటుంది. 2026 ప్రారంభం కాక ముందే రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టండి. దీనిని మీరు ఈశాన్యం వైపు పెడితే మంచిది. రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టేటప్పుడు 7 నుంచి 8 అడుగుల ఎత్తులో ఉండేటట్లు చూసుకోండి. గంగాజలాన్ని ప్రతిరోజూ దానిపై జల్లండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

2.కుబేరుని విగ్రహం

కుబేరుని విగ్రహం ఇంట్లో ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు రావు. కుబేరుని విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టండి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, అవి తొలగిపోతాయి.

3.పొద్దుతిరుగుడు మొక్క

ఇంట్లో సన్‌ఫ్లవర్ మొక్కను పెట్టండి. ఇది పసుపు లేదా ఎరుపు రంగులో ఉన్నా పరవాలేదు. దీంతో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ మొక్కను పని ప్రదేశంలో పెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది.

4.నీటితో నింపిన చెంబు

నీటితో నింపిన మట్టి కుండ లేదా చెంబులో నీరు పోసి ఇంటి ఉత్తర దిశలో పెడితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఫౌంటైన్ కూడా పెట్టవచ్చు. ఇలా చేయడం వలన బాగా కలిసి వస్తుంది. కావాలంటే రోజూ ఆ నీళ్లలో తాజా పూలను కూడా వేయండి.

5.వెండి పాత్రలో బియ్యం

కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఒక చిన్న వెండి పాత్రలో బియ్యం వేయండి. దీనిని ఉత్తర దిశలో పెట్టండి. ఇలా ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. ఇలా ఈ మార్పులు చేసినట్లయితే 2026లో మీకు బాగా కలిసి వస్తుంది. దేనికీ లోటు ఉండదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More