...
...
Next Story

అద్భుతమైన యోగాలతో కొత్త సంవత్సరం 2026 మొదటి రోజు, ఈ శుభదినాన శివుడిని ఆరాధించండి, కోరికలన్నీ నెరవేరుతాయి!

ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి నాడు, కృష్ణపక్ష త్రయోదశి నాడు ప్రదోష వ్రతాన్ని చేస్తారు.హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ఆ రోజు శివుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి ఫలితం కనబడుతుంది. శివయ్య అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. జనవరి ఒకటి అంటే ఈరోజు ప్రదోష వ్రతం జరుపుకోవాలి.

Published on: Jan 1, 2026, 08:00:42 IST
Advertisement

2025 పూర్తయి 2026లోకి అడుగుపెట్టాము. ఈరోజు ప్రదోష వ్రతం కూడా. ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి నాడు, కృష్ణపక్ష త్రయోదశి నాడు ప్రదోష వ్రతాన్ని చేస్తారు.హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ఆ రోజు శివుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి ఫలితం కనబడుతుంది. శివయ్య అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.

అద్భుతమైన యోగాలతో కొత్త సంవత్సరం 2026 మొదటి రోజు (pinterest)
అద్భుతమైన యోగాలతో కొత్త సంవత్సరం 2026 మొదటి రోజు (pinterest)

ప్రదోష వ్రతాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో ఆచరించాలి. జనవరి ఒకటి అంటే ఈరోజు ప్రదోష వ్రతం జరుపుకోవాలి. ఈ రోజు శివుడిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. శివుణ్ని ఆరాధిస్తే కోరికలన్నీ నెరవేరి ఆనందంగా ఉండొచ్చు. కొత్త సంవత్సరం మొదటి రోజు శివయ్యను పూజిస్తే దేనికీ లోటు ఉండదు. ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.

ప్రదోష వ్రతం 2026 శుభ సమయం:

పంచాంగం ప్రకారం పుష్య మాసం శుక్లపక్ష త్రయోదశి తేదీ డిసెంబర్ 31, బుధవారం ఉదయం 1:48కి మొదలైంది. జనవరి ఒకటి గురువారం, అంటే ఈరోజు రాత్రి 10:23 వరకు ఉంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి. కాబట్టి ఈ జనవరి ఒకటి, అంటే ఈ రోజున ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి.

ఈ ప్రదోష వ్రతం నాడు ఏ సమయానికి పూజించాలి?

ప్రదోష వ్రతం నాడు, అంటే ఈరోజు సాయంత్రం 4:55 నుంచి 6:35 వరకు పూజ చేయడానికి సరైన సమయం. ఈ సమయంలో శివుణ్ని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి, ఆనందంగా ఉండొచ్చు.

ప్రదోష వ్రతం నాడు వీటిని పాటిస్తే మంచిది

ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ప్రదోష వ్రతం నాడు శుభ యోగాలు ఏర్పడడం కూడా విశేషం. ఈరోజు రవి యోగంతో పాటు చత్రుగ్రాహి యోగం కూడా ఏర్పడింది. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడింది. అలాగే బుధాదిత్య రాజయోగం, కుజ ఆదిత్య రాజయోగం, శుక్ర ఆదిత్య యోగం కూడా ఏర్పడడం విశేషం.

ప్రదోష వ్రతం ఉపవాసం:

  1. ప్రదోష వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే శివుణ్ని ఆరాధించాలి. అలాగే సాయంత్రం ప్రదోష సమయంలో కూడా శివుని పూజించాలి. వీలైతే రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది.
  2. కొత్త సంవత్సరం మొదటి రోజు ప్రదోష వ్రతం వచ్చింది. ఈరోజు ముందు ఇల్లును శుభ్రంగా ఉంచి, ఆ తర్వాత గంగాజలాన్ని జల్లి, శుభ్రమైన వస్త్రాన్ని పరిచి దానిపై శివుడు–పార్వతుల విగ్రహాన్ని పెట్టి అభిషేకం చేయాలి.
  3. గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, బిల్వపత్రాలు, తేనె వంటి వాటిని సమర్పించండి.
  4. శివుడికి ఇష్టమైన పువ్వులను కూడా సమర్పించండి.
  5. నైవేద్యం, ధూప, దీప, హారతులతో శివుణ్ని ఆరాధించి శివ మంత్రాలను పఠించండి. ఇలా చేయడం వలన న్యూ ఇయర్ మొదటి రోజు సకల సంతోషాలు కలుగుతాయి

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks