అతిగా ఆలోచించే అలవాటును ఎలా తగ్గించుకోవాలి? గీతలో శ్రీకృష్ణుడి సమాధానం

మీ మనస్సు కూడా పాత విషయాల గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ చంచలంగా ఉంటుందా? భగవద్గీత యొక్క 7 విలువైన ఆలోచనలను తెలుసుకోండి, ఇది మీ అపస్మారక ఆందోళనను తొలగిస్తుంది మరియు అతిగా ఆలోచించడం నుండి మీకు ఎప్పటికీ ఉపశమనం కలిగిస్తుంది.

Published on: Sep 3, 2026, 08:00:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేటి బిజీ డిజిటల్ జీవితంలో శరీరంతో పాటు మనసు కూడా వేగంగా అలసిపోతోంది. ఏదో ఒక పాత సంఘటనను పదే పదే మననం చేసుకోవడం, ఇతరులు అన్న మాటలపై అనవసరంగా మదనపడటం లేదా భవిష్యత్తు గురించి భయపడటం చాలామందిలో సాధారణమైపోయింది. సమస్య చాలా చిన్నదైనప్పటికీ, మనసు దానిని పదే పదే ఆలోచించి పెద్దదిగా మార్చేస్తుంది.

అతిగా ఆలోచించే అలవాటును ఎలా తగ్గించుకోవాలి? గీతలో శ్రీకృష్ణుడి సమాధానం (AI)
అతిగా ఆలోచించే అలవాటును ఎలా తగ్గించుకోవాలి? గీతలో శ్రీకృష్ణుడి సమాధానం (AI)

ఈ స్వభావమే క్రమంగా 'ఓవర్‌ థింకింగ్‌' (అతిగా ఆలోచించడం) అనే మానసిక సమస్యగా మారుతుంది. మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి మనోవేదనతోనే సతమతమయ్యాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించిన అమూల్యమైన గీతోపదేశం నేటి అశాంతి పూరిత మనసులకు కూడా చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. భగవద్గీత ప్రకారం మనసులో ఆలోచనలు రావడం సహజం, కానీ ప్రతీ ఆలోచననూ పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదని పెద్దలు చెబుతున్నారు.

మనసును ఓ సాధనంగా చూడండి, యజమానిగా కాదు

మనసు చాలా బలమైనది. దీనికి కనుక సరైన అజమాయిషీ లేకపోతే అది ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనలోకి మనల్ని లాకెళ్తుంది. ఎప్పుడో జరిగిన గతం మనల్ని బాధిస్తుంటుంది, లేదంటే రాబోయే రేపటి గురించిన భయం వెంటాడుతుంది. వీటన్నింటి మధ్యలో మన చేతుల్లో ఉన్న 'వర్తమానం' మాత్రం కరిగిపోతుంది. కాబట్టి, నిరంతర అభ్యాసంతో మనసును అదుపులో ఉంచుకోవచ్చని గీత చెబుతోంది. ప్రతి ఆలోచనను నిజమని నమ్మాల్సిన పనిలేదు. మనసును పనుల్లో నిమగ్నం చేయాలే తప్ప, దాని వెంటే మనమూ పరుగెత్తకూడదు.

ఆలోచనలతో నిరంతరం యుద్ధం చేయవద్దు

ఓవర్‌ థింకింగ్ బారిన పడిన మనిషి తన సొంత ఆలోచనలతోనే కుస్తీ పడుతుంటాడు. 'ఈ ఆలోచన నా మెదడులోకి ఎందుకు వచ్చింది? దీన్ని ఇప్పుడే ఎలా ఆపాలి?' అని సతమతమవుతుంటాడు. ఇలా ఆలోచనలను బలవంతంగా అణచివేయాలని చూస్తే ఆందోళన మరింత పెరుగుతుంది. దీనికి బదులుగా ఆ ఆలోచన స్వభావాన్ని గమనించాలి. ఇది మనకు ఏదైనా పరిష్కారాన్ని చూపుతుందా లేక పాత విషయాలనే మళ్లీ మళ్లీ తిప్పుతుందా అని బేరీజు వేసుకోవాలి. ఈ తేడాను గ్రహించడమే మనసును తేలికపరిచే మొదటి మెట్టు.

ఫలితం గురించి కాకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టండి

అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణం భవిష్యత్తును పూర్తిగా మన నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ఆరాటమే. రేపు ఏం జరుగుతుంది? మనం తీసుకునే నిర్ణయం సరైనదేనా? నలుగురూ ఏమనుకుంటారు? అనే ప్రశ్నలు మనిషిని కృంగదీస్తాయి. గీతలోని కర్మయోగం ప్రకారం మీ చేతుల్లో ఉన్న కర్తవ్యాన్ని నిర్వర్తించండి. భవిష్యత్తు పూర్తిగా మన వశంలో ఉండదు, కానీ ఈ క్షణంలో వేసే తర్వాతి అడుగు మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఫలితాన్ని మాత్రమే ఊహిస్తూ కూర్చుంటే ఏ పనీ ముందుకు సాగదు.

వర్తమానంలో బతకడం నేర్చుకోండి

అతిగా ఆలోచించడం వల్ల మనిషి రెండు చోట్లకు పరిగెడతాడు. ఒకటి గడచిపోయిన కాలం తాలూకు పశ్చాత్తాపం, మరొకటి భవిష్యత్తు గురించిన భయం. ఈ రెండూ కలిసి మనిషి వర్తమాన శాంతిని నాశనం చేస్తాయి. భగవద్గీత అందించే అతిపెద్ద గుణపాఠం ఇదే.. ఏ సమయంలో ఏ పని చేయాలో దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టండి. గడిచిపోయిన కాలాన్ని మనం ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేము. రాబోయే కాలం కళ్ల ముందర ఇంకా రాలేదు. ఈ క్షణంలో చేయాల్సిన చిన్న మంచి పనే మనసును స్థిమితంగా ఉంచడానికి సహాయపడుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More