ఈ 3 రాశుల మహిళలకు ఓర్పే అతి పెద్ద బలం.. కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా కన్య, వృషభ, మకర రాశుల మహిళలు ఓర్పు, ప్రశాంతత, బాధ్యతాయుతమైన స్వభావానికి ప్రతీకలుగా నిలుస్తారు. కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆవేశపడకుండా తెలివిగా ఎదుర్కొంటారు. 

Published on: Jul 27, 2026, 12:30:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను అంచనా వేయొచ్చు. ఒక్కో రాశి వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు కొన్నిట్లో ఆరితేరి ఉంటే, అదే కొన్ని రాశుల వారికి బలహీనతలు కావచ్చు.

ఈ 3 రాశుల మహిళలకు ఓర్పే అతిపెద్ద బలం.. కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తారు! (pinterest)
ఈ 3 రాశుల మహిళలకు ఓర్పే అతిపెద్ద బలం.. కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తారు! (pinterest)

మహిళల్లో కూడా చాలా మంది మరి కొంత మందితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. కొందరు మహిళల్లో ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. కొన్ని రాశుల మహిళలు ధైర్యంగా ఉంటారు. ఇంకొంత మంది అంత ధైర్యంగా ఉండలేరు. కొంత మందికి ఓర్పు, శాంతి ఎక్కువ. ఏదైనా కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, సంబంధాలలో ఇబ్బందులు వంటివి ఎదురైతే, కొంతమంది చాలా కుమిలిపోతారు. మరికొంతమంది మాత్రం ప్రశాంతంగా వాటిని ఎదుర్కోగలరు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఓపిక, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశుల మహిళలకు ఓపిక ఎంతో ఎక్కువ. కుటుంబానికి తోడుగా బలంగా నిలుస్తారు.

కన్య రాశి

కన్య రాశి మహిళలు బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వహిస్తారు. ఎలాంటి బాధ్యతనైనా సరిగ్గా నిర్వర్తించగలరు. ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో, పని చేసే చోట సమతుల్యతను పాటిస్తారు.

అలాగే, ఎప్పుడు ఆందోళన చెందాలి, ఏ సమయంలో ప్రశాంతంగా వ్యవహరించాలనేది కూడా ఈ రాశి మహిళలకు బాగా తెలుసు. చాలా మంది వీరి సలహా తీసుకోవడానికి ఇష్ట పడుతుంటారు. ఈ రాశి వారు పక్కన ఉంటే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా దాటేయచ్చని గట్టి నమ్మకం.

వృషభ రాశి

ఈ రాశి మహిళలు ఎంతో ఓపికగా వ్యవహరిస్తారు. స్థిరమైన మనసుతో ఉంటారు. ఏ విషయాల్లో కంగారుపడాలి, ఏ విషయంలో ప్రశాంతంగా ఉండాలో వృషభ రాశి వారికి బాగా తెలుసు. కుటుంబం కోసం ఏం చేయడానికైనా ఈ రాశి వారు ఎప్పుడూ ముందుంటారు.

అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. కోపం వచ్చినా కూడా బయటకు కనపడకుండా, ఓర్పుతో సమస్యను నెమ్మదిగా పరిష్కరిస్తారు. అలాగే, ఈ రాశి మహిళలు ఇతరుల భావాలను కూడా గౌరవిస్తారు. ఇదే వీరికి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది.

మకర రాశి

మకర రాశి మహిళలు ప్రాక్టికల్‌గా ఉంటారు. ఏ కష్టాన్నైనా సులభంగా దాటేస్తారు. క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా భావోద్వేగానికి గురికాకుండా, ప్రశాంతంగా పరిష్కరిస్తారు. లక్ష్యాలను చేరుకోవడంలో ఎంతో దృఢంగా ఉంటారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరు.

ఏ మాత్రం వెనకడుగు వేయరు. ఎంత కష్టం వచ్చినా కూడా ఓపికతో ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తోడుగా ఉంటారు. భర్తకు మంచి సలహాదారుగా కూడా నిలుస్తారు. ఈ రాశి మహిళలు కుటుంబాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా చక్కదిద్దుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More