పంచగ్రాహి యోగం: కుంభ రాశిలో ఐదు ప్రధాన గ్రహాల సంయోగంతో పంచగ్రాహి యోగం.. హొలీ వరకు ఈ రాశులకు సమస్యలు!

సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కుంభరాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. హోలీ వరకు కొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా, కెరీర్ పరంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు కలగవచ్చు. 

Published on: Feb 25, 2026, 13:30:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు కొన్ని గ్రహాల కలయిక కూడా ఏర్పడుతుంది. ప్రత్యేకమైన పంచగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడబోతోంది. హోలీ వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశిలో ఐదు ప్రధాన గ్రహాల సంయోగంతో పంచగ్రాహి యోగం (pinterest)
కుంభ రాశిలో ఐదు ప్రధాన గ్రహాల సంయోగంతో పంచగ్రాహి యోగం (pinterest)

ఐదు ప్రధాన గ్రహాల కలయిక

సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కుంభరాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. హోలీ వరకు కొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా, కెరీర్ పరంగా, కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు కలగవచ్చు. హోలీ వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

పంచగ్రాహి యోగంతో ఈ రాశులకు సమస్యలు.. హొలీ వరకు జాగ్రత్తగా ఉండాలి

1.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ యోగం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి ఎనిమిదవ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఊహించని మార్పులు రావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా ఎవరి నుంచి అయినా తీసుకోవడం మంచిది కాదు. మానసిక ఒత్తిడి తగ్గడానికి ధ్యానం చేయడం మంచిది. శివలింగానికి నీరు సమర్పించండి.

2.కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశికి ఆరవ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ యోగం గొడవలు, అనారోగ్య సమస్యలు, అప్పులు వంటివి కలిగించే అవకాశం ఉంది. ఎవరితోనూ గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి.

భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించండి. నెగిటివ్ విషయాలను విన్నప్పుడు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

3.మీన రాశి

మీన రాశి వారికి ఈ యోగం కారణంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి పన్నెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. నష్టాలు కలగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా కూడా సమస్యలు రావచ్చు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

పని ప్రదేశంలో ఒత్తిడి పెరగవచ్చు. సహనంతో పని చేయడం మంచిది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు లేకుండా జాగ్రత్తపడాలి. విష్ణువుకు సంబంధించిన మంత్రాలను జపిస్తే మానసిక ప్రశాంతత, సానుకూల మార్పులను చూడొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More