మరి కొన్ని రోజుల్లో మకర రాశిలో పంచగ్రాహి యోగం.. మూడు రాశులకు స్వర్ణకాలం మొదలు!

జనవరిలో చూసుకున్నట్లయితే, ఐదు గ్రహాలు ఒకేసారి మకర రాశిలో సంయోగం చెందబోతున్నాయి. మకర రాశిలో ఐదు గ్రహాలు సంయోగం చెందడంతో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చినా, కొన్ని రాశుల వారికి మాత్రమే ఎక్కువ లాభాలను తీసుకు వస్తుంది. 

Published on: Jan 6, 2026, 08:00:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా మార్పును తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు ఎదురైతే, ఇంకొక సారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల సంచారం అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

మరి కొన్ని రోజుల్లో మకర రాశిలో పంచగ్రాహి యోగం.. మూడు రాశులకు స్వర్ణకాలం మొదలు (pinterest)
మరి కొన్ని రోజుల్లో మకర రాశిలో పంచగ్రాహి యోగం.. మూడు రాశులకు స్వర్ణకాలం మొదలు (pinterest)

జనవరిలో చూసుకున్నట్లయితే, ఐదు గ్రహాలు ఒకేసారి మకర రాశిలో సంయోగం చెందబోతున్నాయి. మకర రాశిలో ఐదు గ్రహాలు సంయోగం చెందడంతో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చినా, కొన్ని రాశుల వారికి మాత్రమే ఎక్కువ లాభాలను తీసుకువస్తుంది.

జనవరి 24న పంచగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ అరుదైన యోగం ఏర్పడటం చాలా విశేషం. ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఈ పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఒకేసారి మకర రాశిలో సంయోగం చెందబోతున్నారు. దీంతో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది జనవరి 24న ఏర్పడడంతో అనేక విధాలుగా మార్పులను చూడవచ్చు. మకర రాశిలో పంచగ్రాహి యోగం ఎవరికి కలిసి రానుంది? ఈ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో ఇప్పుడే చూసుకోండి.

మకర రాశిలో పంచగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం.

1.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ యోగం బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. కెరీర్‌లో కూడా మంచి లాభాలు ఉంటాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తులు కొనాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. భూమి, ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2.మకర రాశి

మకర రాశి వారికి అద్భుతమైన యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని ప్రదేశంలో కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆనందంగా ఉంటారు. ప్రమోషన్ వస్తుంది. వ్యాపారులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ఎక్కువగా లాభాలను పొందుతారు.

3.మీన రాశి

మీన రాశి వారికి ఈ యోగం అద్భుతంగా మారిపోతుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. జీవితంలో సానుకూల మార్పులను చూడవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. భవిష్యత్తు కోసం అనుకున్న ప్లాన్లు అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More