ఈ తేదీల్లో పుట్టిన వారు సూపర్ స్మార్ట్.. క్షణాల్లో ఏ పనినైనా పూర్తి చేసేస్తారు!
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. కొంతమంది ఏ పనినైనా పూర్తి చేస్తారు. బద్ధకం లేకుండా అన్నింటినీ సులువుగా పూర్తి చేస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఈ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారో చూద్దాం.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. కొంతమంది ఏ పనినైనా పూర్తి చేస్తారు. బద్ధకం లేకుండా, ఏకాగ్రతతో అన్నింటినీ సులువుగా పూర్తి చేస్తారు.

తెలివిగా, చురుకుగా ఉంటారు
కొంత మందికి ఏ పని అయినా కష్టంగా ఉంటుంది, అంత ఈజీగా సాల్వ్ చేయలేరు. కాస్త టైం తీసుకుంటారు, ఓపికతో చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ పనినైనా క్షణాల్లో పూర్తి చేస్తారు. పైగా ఏ పని వారికీ కష్టంగా అనిపించదు. తెలివిగా, చురుకుగా ఉంటారు. సృజనాత్మకత లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పైగా పెద్దగా కష్టపడకుండానే అన్నిటినీ సులువుగా పూర్తి చేస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఈ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారో చూద్దాం. వీరిలో మీరు కూడా ఒకరై ఉండవచ్చు చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ పనినైనా చురుకుగా పూర్తి చేస్తారు
న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, ఏదైనా నెలలో 1, 5, 10, 14, 19, 23, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారు స్మార్ట్‌గా అన్ని పనుల్ని పూర్తి చేస్తారు. మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే సమయాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు. తక్కువ టైంలోనే ఎక్కువ పనులన్నీ పూర్తి చేస్తారు. పైగా అంత కష్టపడరు. తెలివిగా వాటిని పూర్తి చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది.
కొన్ని బలహీనతలు:
ఈ తేదీల్లో పుట్టిన వారు పనిలో ఎక్కువ మునిగిపోతుంటారు. ఒకవేళ ఏదైనా టార్గెట్ పెట్టుకున్నట్లైతే, విశ్రాంతి కూడా తీసుకోకుండా వాటిని పూర్తి చేస్తారు. కొన్ని సార్లు వారి స్వభావం వలన ఒత్తిడి పెరుగుతుంది. కానీ క్రమశిక్షణ, పట్టుదలతో మళ్లీ మామూలుగా ఉంటారు. కష్టం వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గరు. విజయాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు.
ఈ రంగాలు వీరికి కలిసి వస్తాయి
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ రంగంలో అయినా తన సత్తాను చాటగలరు. ఉద్యోగం, వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. కళా రంగాల్లో కూడా ముందుంటారు. ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, మధ్యలో వదిలిపెట్టడం వీరికి నచ్చదు. పూర్తయ్యే వరకు కష్టపడతారు. వీరిలో నమ్మకం ఎక్కువగా ఉంటుంది.
ఏ పనినైనా ఏ టైమ్‌కి పూర్తి చేయాలనుకుంటే, ఆ టైమ్‌కి పూర్తి చేస్తారు. అందుకే ఇతరులు కూడా వీరిని ఎక్కువ నమ్ముతారు. పనిలో నాణ్యత కూడా ఉంటుంది. వీరి మాట తీరు కూడా బాగుంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అందుకే గౌరవం కూడా లభిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


