మనకి ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని సాముద్రిక శాస్త్రం చెప్పబడింది. సాముద్రిక శాస్త్రంలో మన శరీర ఆకృతి, పుట్టుమచ్చలు మొదలైన వాటి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చాలా విషయాలను చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని చోట్ల పుట్టుమచ్చలు, గుర్తులు ఉంటే అదృష్టవంతులని చెబుతారు. మీకు ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే కచ్చితంగా మీరు కూడా అదృష్టవంతులే.

శరీరంలో వివిధ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం వరిస్తుందని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. పుట్టుమచ్చల ఆధారంగా శుభ సంకేతాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటే మాత్రం మీ వెంటే అదృష్టం ఉంటుంది. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉన్న అమ్మాయిలైతే మహారాణుల్లా జీవిస్తారు.
ఈ ప్రదేశాల్లోపుట్టుమచ్చలు ఉంటే అదృష్టం ఫుల్లుగా ఉంటుంది, మహారాణుల్లా జీవిస్తారు
భుజంపై పుట్టుమచ్చ:
స్త్రీ భుజంపై పుట్టుమచ్చ ఉంటే ఆమె చాలా అదృష్టవంతురాలు అని చెప్పొచ్చు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. చక్కని సౌకర్యాలతో జీవిస్తారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ఉదారమైన మనసుతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు.
కుడి చెంప:
సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. తక్కువ శ్రమతోనే విజయాలను అందుకుంటారు. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు తర్వాత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
ముక్కుపై పుట్టుమచ్చ:
సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకైనా, స్త్రీలకైనా ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు. ముక్కు కొన మీద పుట్టుమచ్చ ఉంటే సకల సౌకర్యాలను పొందుతూ సంతోషంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
బొటనవేలుపై పుట్టుమచ్చ:
సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకైనా, స్త్రీలకైనా బొటనవేలుపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. బొటనవేలు మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారి విజయాన్ని ఎవరు ఆపలేరు. సక్సెస్‌తో దూసుకుపోతారు.
నుదుటిపై పుట్టుమచ్చ:
నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే కూడా అదృష్టవంతులే. ముఖ్యంగా నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే విజయాలను అందుకుంటారు. 35 ఏళ్ల తర్వాత వీరి జీవితం వెలుగులతో నిండి ఉంటుంది. ఆనందంగా ఉంటారు, అందరూ గౌరవిస్తారు.
పెదాలపై పుట్టుమచ్చ:
{{/usCountry}}నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే కూడా అదృష్టవంతులే. ముఖ్యంగా నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే విజయాలను అందుకుంటారు. 35 ఏళ్ల తర్వాత వీరి జీవితం వెలుగులతో నిండి ఉంటుంది. ఆనందంగా ఉంటారు, అందరూ గౌరవిస్తారు.
పెదాలపై పుట్టుమచ్చ:
{{/usCountry}}మహిళల పెదాలపై పుట్టుమచ్చ ఉంటే అది శుభప్రదం. ఇలాంటి వారు ఎంతో ఆకర్షణగా కనిపిస్తారు. జీవిత భాగస్వామి కూడా ఎంతో ప్రేమిస్తారు. జీవితంలో కష్టపడాల్సిన అవసరం ఉండదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.