పుట్టిన తేదీ ఆధారంగా ఎలా అయితే వారి గురించి తెలుసుకోవచ్చో, పుట్టిన నెల, పేరులో మొదటి అక్షరం కూడా చాలా విషయాలను తెలుపుతాయి. మీ పేరు 'A' అక్షరంతో మొదలవుతుందా? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. న్యూమరాలజీ ప్రకారం, పేరు ఏ అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారు సంబంధాల విషయాల్లో సీరియస్‌గా ఉంటారు.

ప్రేమలో నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 'A' అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారి దృష్టిలో ప్రేమ అంటే కేవలం గొప్ప వాగ్దానాలే కాదు, చిన్న చిన్న పనులు, శ్రద్ధ చూపించడం కూడా. మీ పేరు కూడా 'A' అక్షరంతో మొదలవుతున్నట్లయితే, ప్రేమ జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
పేరు 'A' అక్షరంతో మొదలవుతుందా? అయితే మీ ప్రేమ జీవితం ఇలా ఉంటుంది
ఏ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే సంబంధాల్లో ప్రేమను వ్యక్తపరచడానికి పెద్ద పెద్ద వాగ్దానాలు లేదా మాటలు అక్కర్లేదు. వ్యక్తులు చిన్న చిన్న పనులు, వారిపై శ్రద్ధ చూపించడం వంటి వాటి ద్వారా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ప్రభావితంగా ఇవే అనిపిస్తాయని మీరు ఫాలో అవుతూ ఉంటారు.
శ్రద్ధగా వింటారు
'A' అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు భాగస్వామి చెప్పే చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుంటారు. ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వారు అడగకుండానే వారికి కావాల్సిన వస్తువులను తీసుకురావడం, ముఖ్యమైన తేదీలను గుర్తుపెట్టుకోవడం వంటివి కూడా చేస్తారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రశ్నలు వేయరు. వారికి తోడుగా ఉంటారు. కష్ట సమయాల్లో ఆదుకుంటారు.
మాటలు కంటే ప్రవర్తనకే ఎక్కువ ప్రాధాన్యత
'A' అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారు ఒకటవ సంఖ్యకు చెందినవారు. ఒకటవ సంఖ్య స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, చొరవ, నాయకత్వ లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది.
{{/usCountry}}'A' అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారు ఒకటవ సంఖ్యకు చెందినవారు. ఒకటవ సంఖ్య స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, చొరవ, నాయకత్వ లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది.
{{/usCountry}}ఒక వ్యక్తి పూర్తి వ్యక్తిత్వాన్ని పేరులో మొదటి అక్షరం పూర్తిగా నిర్ణయించలేదు. పేరులోని అన్ని అక్షరాల సంఖ్యల విలువను కలిపి వచ్చే మొత్తాన్ని కూడా న్యూమరాలజీలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
స్పేస్ ఇస్తారు
అవసరమైతే భాగస్వామికి స్పేస్ ఇస్తారు. అది కూడా ప్రేమకు సంకేతమే. ఎప్పటికప్పుడు మెసేజ్‌లను పంపడం, నిరంతరం తమ దృష్టిని కోరడం కంటే భాగస్వామి తమపై నమ్మకం ఉంచడమే సౌకర్యవంతంగా భావిస్తారు.
చిన్న చిన్న ప్రయత్నాలు
'A' అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు భాగస్వామిని ఆకట్టుకోవడానికి ఖరీదైన బహుమతులు ఇవ్వకపోవచ్చు. కానీ వారు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటారు. వారు చెప్పిన చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. అవసరమైనప్పుడు సపోర్ట్‌గా ఉంటారు. చిన్న ప్రయత్నాలు వారిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి.