...
...
Next Story

దీపావళికి ముందు పేదరికం నుంచి బయటపడే రాశులు ఇవే.. ఊహించని ఆర్థిక లాభాలు!

దీపావళికి ముందు ఐదు రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక స్థితి, సంపద సముపార్జన పరంగా గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. ఆ అదృష్ట రాశులు ఏంటో మీరు తెలుసుకోండి.

Published on: Sep 6, 2026, 16:30:26 IST
Advertisement

జ్యోతిష్య గణనల ప్రకారం, గ్రహ సంచారం పరంగా రాబోయే కొన్ని రోజులు చాలా ముఖ్యమైన కాలం. ఈ కాలంలో అనేక ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే ఈ గ్రహ సంచారం ప్రత్యక్ష ప్రభావం 12 రాశులన్నింటిపైనా ఉన్నప్పటికీ, దీపావళికి ముందు ఇది ఐదు నిర్దిష్ట రాశులకు ప్రత్యేక అదృష్టాన్ని తెస్తుంది. 2026 నవంబర్‌లో దీపావళి రాబోతోంది. దానికి ముందు ఈ ఐదు రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక స్థితి, సంపద పరంగా మంచి రోజులు రాబోతున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవి?

వృషభ రాశి

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి శుభవార్తలు అందనున్నాయి. పనిలో మీ బాధ్యతలు పెరిగినప్పటికీ, అది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు మార్గం సుగమం చేస్తుంది. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టులు, కొత్త కస్టమర్ సంబంధాల ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక అడ్డంకులు తొలగిపోయి, ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. అయితే మీరుే అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే, దీపావళి నాటికి మీరు ఆర్థికంగా మరింత బలపడతారు.

మిథున రాశి

మీ కెరీర్‌లో మీరు గొప్ప సానుకూల మార్పులను చూస్తారు. కార్యాలయంలో మీ నైపుణ్యాలు గుర్తి్స్తారు. మీ సీనియర్ల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యక్తులను కలవడం ద్వారా భవిష్యత్తులో బాగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో జరిగే గ్రహ మార్పులు కొత్త ఆదాయ వనరులను సృష్టించి, మిమ్మల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తాయి.

సింహ రాశి

అక్టోబర్ నెలాఖరు నాటికి సింహరాశి వారి జీవితాలలో ఒక ముఖ్యమైన మలుపు రానుంది. ముఖ్యంగా అక్టోబర్ 31న గురు గ్రహం సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉండగా వ్యాపారవేత్తలు పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు. దీపావళి నాటికి, మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. గురు గ్రహం సహాయంతో మీరు చేసే అన్ని పనులలో విజయం సాధిస్తారు.

తులారాశి

దీపావళికి ముందు ధనుస్సు రాశి వారి దీర్ఘకాల కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. కొత్త బాధ్యతలతో పాటు మీ కెరీర్‌లో మంచి పురోగతిని చూస్తారు. వ్యాపారవేత్తలు తమ ప్రస్తుత వ్యాపారం నుండి భారీ లాభాలను పొందుతారు. దూర నగరాలు లేదా విదేశీ సంబంధాల నుండి ఆర్థిక లాభాలు వచ్చేందుకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe