Guru Chandala Yogam: గురు చండాల యోగం అంటే ఏంటి, దీని వలన ఎలాంటి ఫలితాలను ఎదుర్కోవాలి?
Guru Chandala Yogam: జాతకంలో గురువు, రాహువు కలిసి ఉంటే దానిని గురు రాహు దోషమని అంటారు. మన జాతక చక్రంలో 1, 4, 7, 10 స్థానాల్లో గురువు, రాహువు కలిసి ఉన్నట్లయితే దానిని గురు చండాల యోగమని అంటారు. ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక గ్రహ మహాదశ నడుస్తుంది లేదా అంతర్దశలు నడుస్తూ ఉండొచ్చు.
Guru Chandala Yogam: జ్యోతిష్య శాస్త్రంలో చూసినట్లయితే అనేక యోగాలు ఉన్నాయి. అయితే చాలా మందికి ఈ యోగాల గురించి అవగాహన లేదు. నిజానికి కొన్ని శక్తివంతమైన యోగాలు గురించి మనం వింటూ ఉంటాం. గజకేసరి యోగం, గురుచండాల యోగం, కాలసర్ప యోగం ఇలాంటివి. వీటిలో గురు చండాల యోగం అంటే ఏంటి? ఈ యోగం మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

గురు చండాల యోగం అంటే ఏంటి?
జాతకంలో గురువు, రాహువు కలిసి ఉంటే దానిని గురు రాహు దోషమని అంటారు. మన జాతక చక్రంలో 1, 4, 7, 10 స్థానాల్లో గురువు, రాహువు కలిసి ఉన్నట్లయితే దానిని గురు చండాల యోగమని అంటారు. ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక గ్రహ మహాదశ నడుస్తుంది లేదా అంతర్దశలు నడుస్తూ ఉండొచ్చు. ఈ పరిస్థితి జాతకంలో ఉంటే అది ఆ వ్యక్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది.
జాతకంలో గురు చండాల యోగం ఉంటే ఎలా ప్రభావం పడుతుంది?
ఎవరి జాతకంలో గురు చండాల యోగం ఉన్నట్లయితే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాక్కుకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. అలాగే విద్యార్థులు జ్ఞాపకశక్తిని కోల్పోతారు. చదువులో ముందుకు వెళ్లలేరు. బాగా చదివే వారు కూడా వెనక్కి పడిపోతారు. మాటల్లో తడబాటు రావడం, మనసులో మాట్లాడినది బయటకు చెప్పినప్పుడు లోపాలు కనిపించడం వంటివి చూస్తారు. సంతానంలో సఖ్యత ఉండదు. వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో కూడా సమస్యలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావు. కాలం కలిసి రాదు.
గురు చండాల యోగం స్త్రీ జాతకంలో ఉంటే ఏమవుతుంది?
ఒకవేళ గురు చండాల యోగం ఎవరైనా స్త్రీ జాతకంలో ఉన్నట్లయితే, పెళ్లి తర్వాత ఆ స్త్రీ భర్త పురోభివృద్ధిపై ప్రభావం పడుతుంది. అలాగే దంపతుల మధ్య కలహాలు వస్తూ ఉండొచ్చు. మహిళ జాతకంలో ఈ యోగం ఉండి, పంచమ స్థానం బలంగా లేకపోతే సంతాన విషయంలో కూడా ప్రతికూలతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురు చండాల యోగం చాలా తక్కువ మంది పురుషుల జాతకాల్లోనే ఉంటుంది.
జాతకంలో గురు చండాల యోగం ఉంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి?
- ఒకవేళ ఎవరైనా వ్యక్తి జాతకంలో గురు చండాల యోగం ఉంటే వారు ఈ పరిహారాలను పాటించడం మంచిది. దాంతో సమస్యలు తగ్గుతాయి. గురు చండాల యోగం ఉన్న వ్యక్తి దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
- రాహువు ప్రభావం ఎక్కువైతే మంగళవారం, శనివారం రాహుకాల నియమాలను పాటించాలి. దుర్గాదేవిని ఆరాధించాలి.
- గురు చండాల యోగం ఉన్న వ్యక్తి అన్నదానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది.
- చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయడం కూడా చాలా శ్రేయస్కరం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


