Vastu Shastra: వాస్తు ప్రకారం ఈ గుర్తులు ముఖద్వారంపై ఉంటే శుభ గడియలు మొదలవుతాయి, విజయాలను అందుకోవచ్చు!
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినట్లయితే ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు, విజయాలను అందుకోవచ్చు. అలాగే పంచభూతాలను కూడా బ్యాలెన్స్ చేయడానికి వీలవుతుంది. ఈ చిహ్నాలు కూడా పంచభూతాలను బ్యాలెన్స్ చేసి సానుకూల శక్తి ప్రవహించేలా చూస్తాయి. ఈ వాస్తు చిహ్నాలతో ధనవంతులు అయ్యిపోవచ్చు, సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.
చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరూ వారి ఇంటిని అందంగా ఉంచుకోవాలని, వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటారు. అయితే, వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినట్లయితే ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు, విజయాలను అందుకోవచ్చు, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.

అయితే వాస్తు ప్రకారం ముఖద్వారం పై ఈ చిహ్నాలు ఉన్నట్లయితే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించడానికి వీలవుతుంది. సక్సెస్‌ని కూడా అందుకోవచ్చు. మరి ఏ శక్తివంతమైన వాస్తు చిహ్నాలు బాగా హెల్ప్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పంచభూతాలను బ్యాలెన్స్ చేస్తుంది
వాస్తు ప్రకారం పాటించడం వలన సక్సెస్‌ని అందుకోవచ్చు. అలాగే పంచభూతాలను కూడా బ్యాలెన్స్ చేయడానికి వీలవుతుంది. ఈ ఐదు చిహ్నాలు కూడా పంచభూతాలను బ్యాలెన్స్ చేసి సానుకూల శక్తి ప్రవహించేలా చూస్తాయి. ఈ వాస్తు చిహ్నాలతో ధనవంతులు అయ్యిపోవచ్చు, సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.
వాస్తు ప్రకారం ఈ గుర్తులు ముఖద్వారంపై ఉంటే శుభ గడియలు మొదలవుతాయి
1.స్వస్తిక్
ఇంటి ప్రధాన ద్వారం పై స్వస్తిక్ గుర్తు వేసినా వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ముఖద్వారం పై ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే స్వస్తిక్‌ను వేయడం వలన చాలా చక్కటి ఫలితాన్ని చూస్తారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.
2.ఓంకారం
వాస్తు ప్రకారం ఓంకారాన్ని కూడా ప్రధాన ద్వారం పై వేసినా చక్కటి ఎనర్జీ ప్రవహిస్తుంది. పూజ గది తలుపులకు కూడా ఓంకారం వేసుకోవచ్చు. మెడిటేషన్ చేసుకునే చోట కూడా ఓంకారం గుర్తుని వేస్తే మంచిది.
3.శ్రీ
‘శ్రీ’ అనేది లక్ష్మీదేవిని సూచిస్తుంది. ఈ గుర్తుని ముఖద్వారం పై వేసినట్లయితే ప్రతికూల శక్తి తొలగిపోతుంది, ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. అదృష్టం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే డబ్బులు పెట్టుకునే లాకర్ల మీద కూడా ఈ గుర్తుని వేయొచ్చు.
4.కమల పువ్వు
కమల పువ్వు లక్ష్మీదేవికి సంబంధించినది. ఈ గుర్తును కూడా ముఖద్వారం పై వేసితే బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు, విద్యార్థులకు కూడా ఇది మంచి శక్తిని అందిస్తుంది.
5.చేప గుర్తు
చేప గుర్తుని తలుపుపై వేయడం వలన అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. చాలామంది ఇంట్లో చేప గుర్తు పెయింటింగ్స్ వేయించుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం అక్వేరియం ఇంట్లో పెడితే కూడా బాగా కలిసి వస్తుంది.
6.కలశం
పవిత్రమైన పూజ కార్యక్రమాల్లో కలశంలో కొబ్బరికాయ, మామిడి ఆకులను పెడుతూ ఉంటాము. అయితే కలశం గుర్తు తలుపుపై వేయడం వలన మనిషి ఎనర్జీ ప్రవహిస్తుంది. పూజగది తలుపుపై కూడా వేసుకోవచ్చు.
7.తాబేలు
ఇంట్లో చిన్న తాబేలు విగ్రహాన్ని పెడితే వాస్తు ప్రకారం సమస్యలు తొలగిపోతాయి. క్రిస్టల్ తాబేలు లేదా మెటల్ తాబేలును ఇంట్లో పెట్టుకోవచ్చు.
8.శ్రీ యంత్రం
ఇంట్లో శ్రీయంత్రాన్ని పెట్టడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


