మిథున రాశిలో రెండు గ్రహాల కలయికతో గజకేసరి రాజయోగం, మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు
గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకు వస్తుంది. కొన్ని సార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అది కూడా శుభ ఫలితాలను తీసుకొస్తూ ఉంటుంది. గురువు, చంద్రుడు రెండూ కూడా శక్తివంతమైనవి. ఈ రెండు గ్రహాలు సంయోగం జరిగినప్పుడు అద్భుతమైన యోగం ఏర్పడుతుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకు వస్తుంది. కొన్ని సార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అది కూడా శుభ ఫలితాలను తీసుకొస్తూ ఉంటుంది. గురువు, చంద్రుడు రెండూ కూడా శక్తివంతమైనవి. ఈ రెండు గ్రహాలు సంయోగం జరిగినప్పుడు అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ఇది ద్వాదశ రాశి వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది.

ఇప్పుడు అటువంటి అద్భుతమైన యోగం రాబోతోంది. ఈ యోగం ఏర్పడడంతో అనేక రాశుల వారికి లాభాలు కలిగే అవకాశం ఉంది. డిసెంబర్ 4న గురువు కర్కాటకం నుంచి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు డిసెంబర్ 5న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ రెండు గ్రహాలు మిధున రాశిలోకి రావడంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం చాలా శక్తివంతమైన రాజయోగం. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది.
గజకేసరి రాజయోగం
ఈ రెండు గ్రహాలు మిధున రాశిలో ఉన్నప్పుడు కొంతకాలం పాటు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చక్కటి శుభప్రదమైన యోగం. చంద్రుడు, గురువు ఒకటవ, నాల్గవ , ఏడవ, పదవ ఇంట్లో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. డబ్బు, సంతోషం, కీర్తి, పేరు, ప్రతిష్ఠ, విజ్ఞానం కలిగిస్తుంది. గురువు, చంద్రుల సంయోగంతో గజకేసరి యోగంతో ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
గురువు, చంద్రుల సంయోగంతో గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారం
1.కన్యా రాశి
కన్యా రాశికి గజకేసరి యోగం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కొత్త మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. పెట్టుబడి మీకు లాభాలను తెస్తుంది. అందువల్ల, ఈ యోగాలో ఆనందం, భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీరు గుర్తింపును పొందుతారు. మీకు కొత్త విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2.మిథున రాశి
ఈ రాశికి గజకేసరి యోగం వల్ల దీర్ఘకాలిక లక్ష్యాలను కనుగొంటారు. లవ్ లైఫ్ అద్భుతంగా సాగుతుంది. శ్రేయస్సు కలుగుతుంది. వృత్తిపరమైన జీవితంలో ముందుకు సాగే అవకాశాలు మీకు వస్తాయి.
3.మేష రాశి
మేష రాశి వారు మీరు మీ వ్యక్తిగత జీవితంలో మంచి క్షణాలను చూస్తారు. ఈ సమయంలో చాలా కాలం పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులను మీరు పొందుతారు. మీకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మానసిక ఉపశమనం పొందవచ్చు. అదృష్టవశాత్తూ, మీరు వ్యాపారంలో కూడా ప్రయోజనం పొందుతారు. మీరు పెట్టుబడి, ఆస్తి నుండి మంచి రాబడిని పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


