...
...
Next Story

Purse Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఈ ఐదు వస్తువులను పెట్టండి.. డబ్బుకు లోటు ఉండదు, అదృష్టం కూడా ఉంటుంది!

ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని, సకల సంపదలు కలిగి ఉండాలని అనుకుంటారు. అయితే మనం చేసే చిన్న చిన్న వాస్తు దోషాల కారణంగా బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు సానుకూల శక్తిని తీసుకొస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. డబ్బుకి లోటు ఉండదు.

Published on: Nov 14, 2025, 10:00:09 IST
Advertisement

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా కొన్ని వాస్తు నియమాలని పాటించడం మంచిది. ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని, సకల సంపదలు కలిగి ఉండాలని అనుకుంటారు. అయితే మనం చేసే చిన్న చిన్న వాస్తు దోషాల కారణంగా బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు ప్రకారం వీటిని పర్సులో పెట్టుకుంటే డబ్బుకి లోటు ఉండదు (pinterest)
వాస్తు ప్రకారం వీటిని పర్సులో పెట్టుకుంటే డబ్బుకి లోటు ఉండదు (pinterest)

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు సానుకూల శక్తిని తీసుకొస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరి ఎలాంటి వాటిని పరిశులో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? వాస్తు శాస్త్రం ఏం చెప్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం వీటిని పర్సులో పెట్టుకుంటే డబ్బుకి లోటు ఉండదు.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు

1.కుబేర యంత్రం:

కుబేర యంత్రం చాలా శుభప్రదమైనది. దీనిని పర్సులో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. ఆర్థికపరంగా ఎన్నో లాభాలను పొందవచ్చు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కుబేర యంత్రాన్ని పర్సులో పెట్టుకునేటప్పుడు పసుపు రంగు వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం మంచిది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. నెమ్మదిగా ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి.

2.గోమతి చక్రం:

లక్ష్మీదేవికి గోమతి చక్రం అంటే ఎంతో ఇష్టం. గోమతి చక్రాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గోమతి చక్రాన్ని పర్సులో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉండవు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. గోమతి చక్రానికి బొట్లు పెట్టి పర్సులో పెట్టుకోవాలి.ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి.

3.గవ్వలు:

వెండి నాణేన్ని పర్సులో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. శుక్రవారం నాడు పచ్చిపాలతో కడిగి, ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి పర్సులో పెట్టుకుంటే శుభఫలితాలను చూస్తారు. ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడతారు.

5.అక్షింతలు:

అక్షింతలను స్వచ్ఛతకు, సంపదకు చిహ్నంగా భావిస్తారు. శుక్రవారం నాడు అక్షింతలను లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి సమర్పించి, ఆ తర్వాత వాటిని పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వలన డబ్బుకి లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe