సంవత్సరంలో చివరి పుత్రదా ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు అరుదైన యోగాలు వేళ ఇలా చేస్తే పుత్ర ప్రాప్తి, డబ్బు, సంతోషాలు!

ఈ సంవత్సరం పుత్రద ఏకాదశి రోజున అనేక అరుదైన, శుభ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి. సంవత్సరంలో రెండు పుత్రద ఏకాదశులు వస్తాయి. ఒకటి శ్రావణ మాసంలో, మరొకటి పుష్య మాసంలో. రెండింటికీ వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి, రెండు ఏకాదశులలోనూ ఉపవాసం ఉండాలి. పుష్య శుక్ల పక్ష ఏకాదశి డిసెంబర్ 30న వస్తోంది.

Published on: Dec 27, 2025, 13:31:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుష్యమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఇది అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. అన్ని పాపాలను తొలగించడానికి ఏకాదశి తిధి విశేషమైనది అని పద్మ పురాణంలో చెప్పబడింది. అన్ని కోరికలు, విజయాలను ప్రసాదించే విష్ణువును ఆ రోజు ఆరాధిస్తే మంచిది.

సంవత్సరంలో చివరి పుత్రదా ఏకాదశి ఎప్పుడు?
సంవత్సరంలో చివరి పుత్రదా ఏకాదశి ఎప్పుడు?

ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది. కోరికలు తీరుతాయి, పాపాలు తొలగిపోతాయి. ఏకాదశి నాడు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. అదే సమయంలో, పిల్లల కలగలనుకునే వారు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

పుత్రదా ఏకాదశి 2025

ఈ సంవత్సరం పుత్రద ఏకాదశి (Putrada Ekadashi) రోజున అనేక అరుదైన, శుభ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి. సంవత్సరంలో రెండు పుత్రద ఏకాదశులు వస్తాయి. ఒకటి శ్రావణ మాసంలో, మరొకటి పుష్య మాసంలో. రెండింటికీ వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి, రెండు ఏకాదశులలోనూ ఉపవాసం ఉండాలి.

విష్ణువు ఆరాధన

ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల రోజుల్లో ఉపవాసం ఉంటే ఆనందంగా ఉండచ్చని, విష్ణువు అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. ప్రతి ఏకాదశి నాడు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించి, ద్వాదశి రోజున ఉపవాసం విరమించే వ్యక్తి తన ఇంటికి ఆనందం, శ్రేయస్సు మరియు సంతోషాన్ని తెస్తాడని చెబుతారు. ఇది కాకుండా, సంతానం కలగడానికి కూడా ఏకాదశి వరం.

పుత్రదా ఏకాదశి ఎప్పుడు?

ఈ సంవత్సరం 2025 చివరి రోజుకు ఒక రోజు ముందు ఇది వచ్చింది. పుష్య శుక్ల పక్ష ఏకాదశి డిసెంబర్ 30న వస్తోంది. డిసెంబర్ 30న ఉదయం 7:50 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభం కానుంది. ఇది మరుసటి రోజు అంటే డిసెంబర్ 31 ఉదయం 5:00 గంటలకు ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 30న ఈ ఏకాదశి ఉపవాసం ఉండాలి, వ్రతం చేసుకోవాలి.

ఉపవాస విరమణ

డిసెంబర్ 31న మధ్యాహ్నం 1:29 గంటల నుండి మధ్యాహ్నం 3:33 గంటల మధ్య విరమించవచ్చు. ఈ ఉపవాసం పుణ్య ప్రభావం సాధకుడి ఆనందాన్ని, అదృష్టాన్ని, వంశాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని నిష్ఠతో చేస్తే కొడుకు పుడతాడని నమ్మకం.త్రిలోకంలో ఇంతకంటే గొప్ప తిధి లేదని విష్ణుమూర్తి చెబుతాడు. ఈ ఏకాదశి ఉపవాసాన్ని రాజు సుకేతుమన్ పాటించాడు. దీని ఫలితంగా అతనికి తెలివైన కొడుకు లభించాడు.

పుత్రదా ఏకాదశి నాడు అరుదైన యోగాలు

పుత్రదా ఏకాదశి నాడు అరుదైన యోగాలు ఏర్పడతాయి. పుత్రదా ఏకాదశి నాడు సిద్ధి యోగం, శుభ, రవి యోగాలు ఏర్పడతాయి. భద్రవాస యోగం కూడా ఆ రోజు ఏర్పడనుంది. ఈ సమయంలో లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. సుఖసంతోషాలు కలుగుతాయి. దేశవ్యాప్తంగా పుత్రదా ఏకాదశి నాడు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతోషం, సౌభాగ్యంతో పాటుగా వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ ఉపవాస దీక్షను పాటించడం జరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More