శ్రావణ పుత్రదా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం దీపదానం ఎక్కడ, ఏ సమయంలో చేయాలో ఇక్కడ తెలుసుకోండి. గృహస్థులు, వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం పూజా విధానంపై పూర్తి వివరాలు.

శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించడంతో పాటు దీపదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇంటా బయటా సుఖశాంతులు వెల్లివిరియాలని, మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తులు సాయంత్రం వేళ దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ విశేషమైన రోజున ఎక్కడ దీపదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందనే విషయాలపై స్పష్టత ఉండటం అవసరం.
శ్రావణ పుత్రదా ఏకాదశి 2026
ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు అనేదానిపై భక్తులలో స్పష్టత కోసం తిథుల వివరాలు పరిశీలిస్తే, ఆగస్టు 23, 24 తేదీలలో ఈ పర్వదినం వస్తోంది. ఏకాదశి తిథి ఆగస్టు 23 రాత్రి ప్రారంభమై ఆగస్టు 24 ఉదయం వరకు కొనసాగుతుంది.
సాధారణ గృహస్థ సాంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు 23న వ్రతం ఆచరిస్తుండగా, వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వారు ఆగస్టు 24న ఏకాదశి వ్రతం నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో ఏ రోజునైనా భక్తులు విష్ణు పూజతో పాటు దీపదానం నిర్వహించుకోవచ్చు.
తులసి చెంత దీపారాధన
ఏకాదశి సాయంత్రం పూట తులసి మొక్క సమీపంలో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమైన ఆచారంగా భావిస్తారు. ముందుగా తులసి అమ్మవారికి జలసమర్పణ చేసి పూజించాలి.
ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలికించి విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. అయితే తులసి మొక్కకు తగలకుండా కాస్త దూరంగా ప్రమిదను ఉంచడం మంచిది. దీనివల్ల దీపం వేడికి తులసి ఆకులు వాడిపోకుండా ఉంటాయి.
విష్ణు ఆలయాలు మరియు పవిత్ర స్థలాలు
పుత్రదా ఏకాదశి పూర్తిగా జగత్ప్రభువు అయిన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అందువల్ల సమీపంలోని విష్ణు ఆలయాలకు వెళ్లి దీపదానం చేయడం శ్రేయస్కరం. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలోని నిర్దేశిత ప్రదేశంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఆలయాలతో పాటు రావి చెట్టు కింద కూడా దీపాలు వెలిగించే సంప్రదాయం మనవద్ద ఉంది. అయితే చెట్టు కింద ఎండుటాకులు లేకుండా చూసుకోవడం ముఖ్యం.
ఇంటి పూజా మందిరంలో ఆచరణ
ఒకవేళ ప్రత్యేకంగా బయటకు వెళ్లే అవకాశం లేకపోతే, ఇంట ఉండే పూజా మందిరంలోనే భక్తిభావంతో దీపదానం పూర్తి చేయవచ్చు. సాయంత్రం వేళ విష్ణుమూర్తిని ఆర్చన చేసిన తర్వాత దీపం వెలిగించి కాసేపు దైవ నామస్మరణా చేయాలి. దీపాల సంఖ్య ఎంతనేది ముఖ్యం కాదు, కేవలం భక్తి శ్రద్ధలతో వెలిగించే ఒక్క చిన్న దీపం కూడా సంపూర్ణ పుణ్యఫలాన్ని ఇస్తుంది.
సమయం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
{{/usCountry}}ఒకవేళ ప్రత్యేకంగా బయటకు వెళ్లే అవకాశం లేకపోతే, ఇంట ఉండే పూజా మందిరంలోనే భక్తిభావంతో దీపదానం పూర్తి చేయవచ్చు. సాయంత్రం వేళ విష్ణుమూర్తిని ఆర్చన చేసిన తర్వాత దీపం వెలిగించి కాసేపు దైవ నామస్మరణా చేయాలి. దీపాల సంఖ్య ఎంతనేది ముఖ్యం కాదు, కేవలం భక్తి శ్రద్ధలతో వెలిగించే ఒక్క చిన్న దీపం కూడా సంపూర్ణ పుణ్యఫలాన్ని ఇస్తుంది.
సమయం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
{{/usCountry}}సూర్యాస్తమయం అయిన వెంటనే లేదా సాయంత్రం సంధ్యా సమయంలో దీపదానం చేయడం ఆనవాయితీ. ప్రాంతాన్ని బట్టి సూర్యాస్తమయ వేళల్లో మార్పులు ఉంటాయి కాబట్టి స్థానిక పంచాంగాన్ని పరిశీలించి సమయాన్ని నిర్ధారించుకోవడం ఉత్తమం. పవిత్రమైన ఈ రోజున భగవంతుడిని స్మరిస్తూ చేసే దీపదానం జీవితంలో అంధకారాన్ని తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.