...
...
Next Story

Rahu Transit in 2026: కొత్త సంవత్సరం రెండు సార్లు రాహువు సంచారంలో మార్పు.. మూడు రాశులకు ఇబ్బందులు!

Rahu Transit in 2026: 2026లో రాహువు రెండుసార్లు సంచారం చేస్తాడు. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. రెండు సార్లు రాహువు సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Published on: Dec 09, 2025 04:30 PM IST
Advertisement

Rahu Transit in 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 పూర్తి కాబోతోంది, త్వరలోనే 2026 రాబోతోంది. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలని, అన్నీ కలిసి రావాలని అందరూ కోరుకుంటారు. అయితే రాహు కారణంగా కొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

2026లో రాహువు సంచారంలో మార్పు (pinterest)
2026లో రాహువు సంచారంలో మార్పు (pinterest)

2026లో రాహువు రెండుసార్లు సంచారం చేస్తాడు. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. రెండు సార్లు రాహువు సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

2026లో రాహువు సంచారంలో మార్పు

2026లో ఆగస్టు 2న రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత డిసెంబర్ 5న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు సంచారాలు కూడా అశుభ ఫలితాలను తీసుకొస్తాయి. ఈ సమయంలో కొన్ని రాశులకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2026లో రెండు సార్లు రాహువు సంచారంలో మార్పు.. ఈ రాశులకు సమస్యలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి రాహు సంచారంలో మార్పు అశుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కూడా సమస్యలు రావచ్చు. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు.

2.సింహ రాశి

కన్య రాశి వారికి రాహువు సంచారం నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి మానసికంగా సమస్యలు వస్తాయి. కెరీర్‌లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం కాదు. చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు కూడా రాహువు సంచారం జరిగినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe