...
...
Next Story

రక్షా బంధన్ 2026: రాఖీ పండుగ తేదీ, శుభ సమయాలు, రాహుకాలం వివరాలు!

రక్షా బంధన్ 2026 ఆగస్టు 28న జరుపుకుంటారు. రాఖీ పండుగ సరైన తేదీ, శుభ ముహూర్తాలు, రాహుకాలం, భద్ర దోషం, రాఖీ కట్టే పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Aug 5, 2026, 16:00:51 IST
Advertisement

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన పవిత్ర పండుగ రక్షా బంధన్. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ రోజున ఈ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పండుగను ఎంతో ఉత్సాహంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాఖీ పండుగ తేదీ, పూజకు సరైన సమయం వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఏడాది రక్షా బంధన్ ఎప్పుడంటే?

రక్షా బంధన్ 2026: రాఖీ పండుగ తేదీ, శుభ సమయాలు, రాహుకాలం వివరాలు!
రక్షా బంధన్ 2026: రాఖీ పండుగ తేదీ, శుభ సమయాలు, రాహుకాలం వివరాలు!

సనాతన ధర్మం ప్రకారం శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 09:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అనగా ఆగస్టు 28, 2026 శుక్రవారం ఉదయం 09:48 గంటలకు ముగుస్తుంది.

ఉదయ తిథి ప్రాధాన్యతను బట్టి ఈసారి ఆగస్టు 28న రక్షా బంధన్‌ను జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పవిత్ర దినాన సోదరీమణులు నిర్ణీత వేళల్లో రాఖీ కట్టడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.

రాఖీ కట్టడానికి శుభ ముహూర్తాలు

హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా సరైన ముహూర్తం చూసుకోవడం చాలా ముఖ్యం. రక్షా బంధన్ రోజున రాఖీ కట్టడానికి రెండు ప్రత్యేక ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి.

మొదటి ముహూర్తం: ఉదయం 05:57 నిమిషాల నుంచి ఉదయం 09:48 నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం.

రెండో ముహూర్తం: ఉదయం పూట కుదరని వారి కోసం మధ్యాహ్నం 01:52 నిమిషాల నుంచి సాయంత్రం 04:35 నిమిషాల వరకు మరో మంచి ముహూర్తం ఉంది.

భద్ర లేదా రాహుకాలం జాగ్రత్తలు

జ్యోతిష్య శాస్త్రంలో రాహుకాలం, భద్ర వంటి సమయాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. ముఖ్యంగా రాహుకాలంలో ఎలాంటి మంచి పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఆగస్టు 28న ఉదయం 10:46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:22 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టడం వర్జ్యం. అయితే ఈసారి రక్షా బంధన్ రోజున భద్ర దోషం ఏమీ లేదు. కాబట్టి రాహుకాలం మినహా మిగిలిన సమయంలో ఎప్పుడైనా సోదరుడికి రాఖీ కట్టి దీవెనలు పొందవచ్చు.

అనుసరించాల్సిన పూజా విధానం, నియమాలు

రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి.

సోదరుడి నుదుటిన కుంకుమ తిలకం దిద్ది, దీపం వెలిగించి ముందుగా దేవుడికి, ఆ తర్వాత సోదరుడికి హారతి ఇవ్వాలి.

అనంతరం సోదరుడి కుడి చేతి మణికట్టుకు రాఖీ కట్టి, మిఠాయి తినిపించి నోరు తీపి చేయాలి. సోదరుడు తన శక్తి కొద్దీ కానుకలు లేదా బహుమతులు అందించి సోదరికి ఆశీస్సులు ఇవ్వాలి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe