ఆషాఢ పౌర్ణమి 28న, 29న? ఈ ఒక్క పూజతో విష్ణు-లక్ష్మీ అనుగ్రహం.. చంద్ర దోషం నుంచి విముక్తి!

ఆషాఢ పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, చంద్రదేవుడిని ఆరాధించడం, ఉపవాసం, దానధర్మాలు, పవిత్ర స్నానం చేయడం వల్ల విశేష పుణ్యఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఇదే రోజున గురు పౌర్ణమిని కూడా జరుపుకుంటారు. 

Published on: Jul 25, 2026, 16:00:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని రోజుల్లో ఆషాఢ పౌర్ణమి రాబోతోంది. ఆషాఢ పౌర్ణమి నాడు విష్ణువుని, చంద్రుడిని ఆరాధించడం వలన ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. ఆరోజు పవిత్ర స్నానం, దానధర్మాలు, ఉపవాసం చేయడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.

ఆషాఢ పౌర్ణమి 28న, 29న? ఈ ఒక్క పూజతో విష్ణు-లక్ష్మీ అనుగ్రహం.. చంద్ర దోషం నుంచి విముక్తి!
ఆషాఢ పౌర్ణమి 28న, 29న? ఈ ఒక్క పూజతో విష్ణు-లక్ష్మీ అనుగ్రహం.. చంద్ర దోషం నుంచి విముక్తి!

ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటాము. ఈ పర్వదినం మహర్షి వేదవ్యాసుల జయంతిగా ప్రసిద్ధి. అందుకే ఆ రోజు గురువుని పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.

చంద్ర దోషం నుంచి ఉపశమనం

ఆషాఢ పౌర్ణమి చాలా విశేషమైనది. ఆషాఢ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి, పూజలు, దానధర్మాలు ఆచరిస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా లభిస్తాయి. చంద్ర దోషం నుంచి ఉపశమనాన్ని కూడా పొందడానికి వీలవుతుంది.

ఆషాఢ పౌర్ణమి 2026 తేదీ, శుభ సమయం

పంచాంగం ప్రకారం చూస్తే, శుక్లపక్ష పౌర్ణమి తిథి ఈసారి జూలై 29, బుధవారం నాడు వచ్చింది.

పౌర్ణమి తిథి ప్రారంభం: జూలై 28, మంగళవారం సాయంత్రం 6:18 గంటలకు.

పౌర్ణమి తిథి ముగింపు: జూలై 29, బుధవారం రాత్రి 8:05 గంటలకు.

చంద్రోదయ సమయం: జూలై 29, సాయంత్రం 7:21 గంటలకు.

ఉదయ తిథి ప్రకారం ఆషాఢ పౌర్ణమిని జూలై 29, బుధవారం నాడు ఆచరించాలి.

ఆషాఢ పౌర్ణమి నాడు పూజ ఎలా చేసుకోవాలి? పూజా విధానాన్ని తెలుసుకోండి

బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే, స్నానం చేసే నీళ్లలో గంగాజలాన్ని కలిపి స్నానం చేస్తే మంచిది. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించి, ఉపవాసం ఉండాలని, పూజ చేయాలని సంకల్పం చెప్పుకోవాలి.

రాగి పాత్రలో నీళ్లు, ఎర్రచందనం, అక్షింతలు, ఎర్రటి పుష్పాలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ప్రార్థించాలి. ఆ తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, పీటపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి, విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి.

పసుపు చందనం, అక్షింతలు, పసుపు రంగు పూలు, పండ్లు, పంచామృతం, తులసి దళాలతో పూజ చేసుకోవాలి. తర్వాత స్వీట్లు, పండ్లు, పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఆషాఢ పౌర్ణమి వ్రతకథను చదవాలి. ఒకవేళ కథ విన్నా కూడా మంచి ఫలితం కలుగుతుంది. చివరగా విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ప్రసాదాన్ని భక్తులకు పంచాలి.

చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి

చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలనే విషయానికి వస్తే, సాయంత్రం చంద్రోదయం తర్వాత పాలలో నీరు, అక్షింతలు, తెల్లని పూలు కలిపి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం శాస్త్రోక్తంగా పండ్లు లేదా సాత్విక ఆహారాన్ని తీసుకుని మీ ఉపవాసాన్ని విరమించాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More