ఏడు శుభయోగాల మధ్య రక్షాబంధన్.. అన్నాచెల్లెళ్లకు ఈసారి పండుగ మరింత ప్రత్యేకం.. రోజంతా రాఖీ కట్టొచ్చా?

2026 ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగను ఏడు అరుదైన శుభయోగాల కలయికతో జరుపుకోనున్నారని జ్యోతిష్య పరంగా పేర్కొంటున్నారు. ఈసారి రాఖీ రోజున భద్ర దోషం లేకపోవడం ప్రత్యేక విశేషంగా చెప్పబడుతోంది.

Published on: Aug 25, 2026, 12:30:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అన్నాచెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ ఈసారి మరింత ప్రత్యేకంగా రానుంది. సాధారణంగా రాఖీ పండుగ రోజు భద్ర కాలం ఎప్పుడు వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతుంటారు. కానీ, ఈసారి ఆ టెన్షనే లేదు. ఏకంగా ఏడు అరుదైన శుభయోగాలు కలిసిరావడంతో ఈ పండుగ విశిష్టత సంతరించుకుంది. ఆగస్ట్ 28వ తేదీన దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు.

ఏడు శుభయోగాల మధ్య రక్షాబంధన్.. అన్నాచెల్లెళ్లకు ఈసారి పండుగ మరింత ప్రత్యేకం.. రోజంతా రాఖీ కట్టొచ్చా? (pixabay)
ఏడు శుభయోగాల మధ్య రక్షాబంధన్.. అన్నాచెల్లెళ్లకు ఈసారి పండుగ మరింత ప్రత్యేకం.. రోజంతా రాఖీ కట్టొచ్చా? (pixabay)

భద్ర టెన్షన్ లేదు.. రోజంతా రాఖీ కట్టవచ్చు

జ్యోతిష్య నిపుణుల లెక్కల ప్రకారం, ఈ ఏడాది రక్షాబంధన్ రోజున భద్ర దోషం అసలు లేదు. ఆగస్ట్ 27వ తేదీ రాత్రికే భద్ర ముగియనుండటంతో, 28వ తేదీ ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి నిండుగా ఉండటంతో రోజంతా రాఖీ కట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. సోదరీమణులు ఎలాంటి సమయ పరిమితులతో సంబంధం లేకుండా ఉదయం నుంచి రోజంతా తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఏడు అరుదైన శుభయోగాల కలయిక

ఈ పవిత్ర దినాన గ్రహాలు మరియు నక్షత్రాల కలయిక వల్ల ఏడు అరుదైన శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు శతభిషా నక్షత్రం రావడం అత్యంత విశేషం. రాహువు అధిపతిగా ఉండే ఈ నక్షత్రంలో భగవద్గారాధన చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. దీనితో పాటు సుకర్మ, త్రిపుష్కర, సర్వార్థ సిద్ధి వంటి విశేష యోగాలు తోడవుతున్నాయి. ఇదే సమయంలో గురు గ్రహం కర్కాటక రాశిలో సంచరించడం, చంద్రుడు కుంభ రాశిలో ఉండటం పండుగ ప్రభావాన్ని మరింత పెంచాయి. ఈ నక్షత్ర రోజున చేసే దానధర్మాలు, పూజలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.

రాఖీ కట్టడానికి ఉత్తమ ముహూర్తాలు

ఆగస్ట్ 28న శ్రావణ శుక్ల పౌర్ణమి రోజంతా కొనసాగుతుంది. ఉదయం పూట పౌర్ణమి తిథి ఉదయం 9:48 నిమిషాల వరకు ఉంటుంది. అయినప్పటికీ పర్వదినం కావడంతో రోజంతా రాఖీ కట్టవచ్చు.

ఉత్తమ ముహూర్తం: ఉదయం 5:57 నిమిషాల నుంచి ఉదయం 9:48 నిమిషాల వరకు అత్యంత శ్రేయస్కరం.

శుభ ఘడియలు: ఉదయం 11:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:19 నిమిషాల వరకు బాగుంది.

రాహుకాలం గమనిక: ఉదయం 10:11 నిమిషాల నుంచి మధ్యాహ్నం 11:45 నిమిషాల వరకు రాహుకాలం ఉంది. కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టడం మంచిది కాదు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More