ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజు విష్ణువుని ఆరాధించడం వలన విష్ణువు అనుగ్రహం కలిగి, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు.

దీపావళికి కొన్ని రోజుల ముందు వచ్చే ఈ ఏకాదశికి మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు విష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభాలు కలుగుతాయి. రమా ఏకాదశి నాడు ఏం చేయాలి? విష్ణువుని ఆరాధించడం వలన కలిగే లాభాలు ఏంటి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రమా ఏకాదశి 2026 ఎప్పుడు వచ్చింది?
పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఏకాదశి నవంబర్ 05, గురువారం నాడు రమా ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. పాపాలు తొలగిపోయి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
రమా ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించాలి?
రమా ఏకాదశికి లక్ష్మీదేవి పేరుతో సంబంధం ఉంది. కనుక ఆరోజు విష్ణువుని, లక్ష్మీదేవిని ఇద్దరినీ పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతం గురించి పద్మ పురాణంలో కూడా చెప్పబడింది. ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆర్థిక సమృద్ధి కలుగుతుంది.
రమా ఏకాదశి పూజా విధానం
ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత దీపారాధన చేయాలి. అలాగే విష్ణువును, లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. తులసి దళాలతో విష్ణువుని పూజించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఏకాదశి నాడు తులసి ఆకుల్ని కోయకూడదు. కనుక ముందు రోజే తులసి ఆకులను కోసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. సాయంత్రం కూడా విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. స్తోత్రాలు పఠించాలి. భగవద్గీత చదివితే మంచిదే.
రమా ఏకాదశి ప్రాధాన్యత
ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకతలతో రమా ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. ఆ రోజు విష్ణువుని, లక్ష్మీదేవిని పూజించేవారు వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం కూడా మంచి ఫలితాలను అందిస్తాయి.
{{/usCountry}}ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకతలతో రమా ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. ఆ రోజు విష్ణువుని, లక్ష్మీదేవిని పూజించేవారు వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం కూడా మంచి ఫలితాలను అందిస్తాయి.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.