గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటి ప్రభావం 12 రాశుల వారిపై పడుతుంది దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని గ్రహాల సంచారంలో మార్పు వలన మంచి ఫలితాలు కనపడితే ఒక్కోసారి అశుభ ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జూన్ నెల గ్రహాల సంచారంలో కీలక మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెల 15న సూర్యుడు తన రాశిని మార్చి, మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే మిథునంలో బుధుడు, చంద్రుడు ఉండటంతో, సూర్యుడి రాకతో అరుదైన 'త్రిగ్రాహి రాజయోగం' ఏర్పడనుంది. ఈ అద్భుతమైన ఖగోళ కలయిక జూన్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ఆర్థిక, వృత్తిపరమైన లాభాలు చేకూరనున్నాయి.
అదృష్టాన్ని పొందే ఆ నాలుగు రాశులు ఇవే!
1.మిథున రాశి:
ఈ రాజయోగం మీ సొంత రాశిలోనే ఏర్పడుతుండటంతో, గరిష్ట ప్రయోజనాలు మీకే దక్కనున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభించడమే కాకుండా, అదనపు బాధ్యతలు పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభాలను తెచ్చిపెడతాయి.
2.సింహ రాశి:
ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో పాటు, కెరీర్‌లో కొత్త పుంతలు తొక్కడానికి ఇది సరైన సమయం. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ చిరకాల కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
3.కన్యా రాశి:
కెరీర్ పరంగా కన్యా రాశి వారికి ఇది గోల్డెన్ పీరియడ్. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాకతో లాభాలు పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
4.తులా రాశి:
{{/usCountry}}కెరీర్ పరంగా కన్యా రాశి వారికి ఇది గోల్డెన్ పీరియడ్. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాకతో లాభాలు పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
4.తులా రాశి:
{{/usCountry}}ఈ సమయంలో మీకు అదృష్టం తోడవుతుంది. వాయిదా పడిన పనులు మళ్లీ పట్టాలెక్కుతాయి. అనవసరపు చింతలు తొలగి, పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ త్రిగ్రాహి రాజయోగం అద్భుత ఫలితాలను ఇవ్వనుంది.
త్రిగ్రాహి రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రంలో మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే స్థితిని 'త్రిగ్రాహి యోగం' అంటారు. సూర్యుడు, బుధుడు, చంద్రుడు కలవడం వల్ల ఒక శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు, మేధస్సు, మరియు ఆర్థిక వృద్ధికి ప్రాతినిధ్యం వహిస్తుంది.