Rare Parade of 3 Planets: జూన్ 15న మిథున రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. ఈ రాశులకు పట్టనున్న అదృష్టం!
జూన్ 15న ఏర్పడనున్న అరుదైన త్రిగ్రాహి రాజయోగం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన యోగాల్లో ఒకటిగా భావిస్తారు. సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఇప్పటికే అక్కడ ఉన్న బుధుడు, చంద్రుడితో కలిసి శక్తివంతమైన గ్రహ సంయోగాన్ని ఏర్పరచనున్నాడు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటి ప్రభావం 12 రాశుల వారిపై పడుతుంది దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని గ్రహాల సంచారంలో మార్పు వలన మంచి ఫలితాలు కనపడితే ఒక్కోసారి అశుభ ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జూన్ నెల గ్రహాల సంచారంలో కీలక మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెల 15న సూర్యుడు తన రాశిని మార్చి, మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే మిథునంలో బుధుడు, చంద్రుడు ఉండటంతో, సూర్యుడి రాకతో అరుదైన 'త్రిగ్రాహి రాజయోగం' ఏర్పడనుంది. ఈ అద్భుతమైన ఖగోళ కలయిక జూన్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ఆర్థిక, వృత్తిపరమైన లాభాలు చేకూరనున్నాయి.
అదృష్టాన్ని పొందే ఆ నాలుగు రాశులు ఇవే!
1.మిథున రాశి:
ఈ రాజయోగం మీ సొంత రాశిలోనే ఏర్పడుతుండటంతో, గరిష్ట ప్రయోజనాలు మీకే దక్కనున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభించడమే కాకుండా, అదనపు బాధ్యతలు పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభాలను తెచ్చిపెడతాయి.
2.సింహ రాశి:
ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో పాటు, కెరీర్‌లో కొత్త పుంతలు తొక్కడానికి ఇది సరైన సమయం. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ చిరకాల కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
3.కన్యా రాశి:
కెరీర్ పరంగా కన్యా రాశి వారికి ఇది గోల్డెన్ పీరియడ్. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాకతో లాభాలు పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
4.తులా రాశి:
ఈ సమయంలో మీకు అదృష్టం తోడవుతుంది. వాయిదా పడిన పనులు మళ్లీ పట్టాలెక్కుతాయి. అనవసరపు చింతలు తొలగి, పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ త్రిగ్రాహి రాజయోగం అద్భుత ఫలితాలను ఇవ్వనుంది.
త్రిగ్రాహి రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రంలో మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే స్థితిని 'త్రిగ్రాహి యోగం' అంటారు. సూర్యుడు, బుధుడు, చంద్రుడు కలవడం వల్ల ఒక శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు, మేధస్సు, మరియు ఆర్థిక వృద్ధికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


