...
...
Next Story

Planetary Alignment 2026: ఒకే వరుసలో 6 గ్రహాలు.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ మొదలు.. డబ్బు, విజయాలు ఇలా ఎన్నో!

ఫిబ్రవరి నెలలో కొన్ని గ్రహాలు వరుసగా ఉండడంతో వారి జీవితాల్లో మార్పు వస్తుంది. ఫిబ్రవరి 28న ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. పైగా ఈ ఆరు గ్రహాలు కూడా వరుసగా ఉండడంతో కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారికి ఈ గ్రహాల వలన శుభ ఫలితాలు?

Published on: Feb 14, 2026, 13:30:49 IST
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. ఫిబ్రవరి నెలలో కొన్ని ముఖ్య గ్రహాల సంచారంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఫిబ్రవరి నెలలో కొన్ని గ్రహాలు వరుసగా ఉండడంతో వారి జీవితాల్లో మార్పు వస్తుంది. ఫిబ్రవరి 28న ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. పైగా ఈ ఆరు గ్రహాలు కూడా వరుసగా ఉండడంతో కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు.

ఆరు గ్రహాలు

Planetary Alignment 2026: ఒకే వరుసలో 6 గ్రహాలు (pinterest)
Planetary Alignment 2026: ఒకే వరుసలో 6 గ్రహాలు (pinterest)

ఫిబ్రవరి 28న ఒకే సరళరేఖపై ఆరు గ్రహాలు కూడా ఉండబోతున్నాయి. ఏకగోళ సంఘటన కారణంగా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారికి ఈ గ్రహాల వలన శుభ ఫలితాలు కలగబోతున్నాయి? అసలు వారు ఎలాంటి మార్పులు చూస్తారో తెలుసుకుందాం.

ఫిబ్రవరి 28న ఒకే సరళరేఖపై ఆరు గ్రహాలు

బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, యురేనస్, నెప్ట్యూన్ ఒకే సరళరేఖపైకి రాబోతుండడంతో మూడు రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ అదృష్ట రాశులకు అనేక లాభాలు కలుగుతాయి. ఈ రాశుల వారు చాలా విధాలుగా ప్రయోజనాలను పొంది ఆనందంగా ఉండబోతున్నారు. జీవితంలో చాలా మార్పులు కూడా వస్తాయి.

1.మేష రాశి:

మేష రాశి వారికి ఈ గ్రహాల మార్పుతో శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. మేష రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువవుతుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. పని ప్రదేశంలో కొత్త ఎనర్జీ వస్తుంది. జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి.

2.కన్యా రాశి:

మీన రాశి వారికి ఈ గ్రహాల సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అనేక విధాల ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పని ప్రదేశంలో మంచి మార్పులు చూస్తారు. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆనందంగా ఉంటారు. ఇలా ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా శుభ ఫలితాలను పొందుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe