...
...
Next Story

పగడాలను ధరిస్తే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి, ఏ రాశుల వారు ధరిస్తే మంచిదో తెలుసుకోండి!

రత్నశాస్త్రం ప్రకారం చాలా మంది సమస్యలను తొలగించుకోవడానికి రాళ్లను ధరిస్తారు. పగడాన్ని ఎవరు ధరిస్తే మంచిది? ఏ రాశి వారికి పగడం శుభప్రదం? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రత్న శాస్త్రం ప్రకారం పగడాన్ని ధరిస్తే బలం, ధైర్యం కలుగుతాయి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చు, విజయాలను అందుకోవచ్చు.

Published on: Nov 13, 2025, 13:30:14 IST
Advertisement

చాలామంది రకరకాల రత్నాలను, రాళ్లను ధరిస్తూ ఉంటారు. జ్యోతిష్య నిపుణుల సలహా మేరకు రత్నాలను ధరించడం వలన శుభాలు కలుగుతాయి. రత్నశాస్త్రం ప్రకారం చాలామంది సమస్యలను తొలగించుకోవడానికి రాళ్లను ధరిస్తారు. పగడాన్ని ఎవరు ధరిస్తే మంచిది? ఏ రాశి వారికి పగడం శుభప్రదం? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రత్న శాస్త్రం ప్రకారం పగడాన్ని ధరిస్తే బలం, ధైర్యం కలుగుతాయి.

పగడాలను ధరిస్తే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి (pinterest)
పగడాలను ధరిస్తే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి (pinterest)

పగడాన్ని ధరించడం వలన ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చు, విజయాలను అందుకోవచ్చు, నష్టాలు, కష్టాలు తొలగిపోతాయి. అయితే పగడాన్ని ధరించే ముందు మీరు రాశి ప్రకారం చూసుకోవాలి. మీ రాశికి అనుగుణమైన రాయినే ధరిస్తే మంచిది. రత్నాలను ధరించే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పగడాన్ని ధరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. అయితే మరి పగడాల గురించి, పగడాలు ఏ రాశి వారు ధరిస్తే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పగడాలను ధరిస్తే ఈ సమస్యలు తీరుతాయి

ఎవరికి జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే, జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని పగడాన్ని ధరించడం ఉత్తమం. అడ్డంకులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు. మానసిక బలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. పగడాన్ని ధరించడం వలన నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలపడుతుంది, ఉత్సాహం ఎక్కువవుతుంది, సానుకూల ఆలోచనలు మొదలవుతాయి. పగడాన్ని ధరిస్తే ఆరోగ్యానికి కూడా మంచిదే.

శరీరంలో శక్తి పెరగడానికి, వ్యాధులను తగ్గించడానికి కూడా పగడం సహాయపడుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు పగడాన్ని ధరించడం వలన తగ్గుతాయి. సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అవగాహన, ప్రేమ, స్థిరత్వాన్ని పొందడానికి కూడా వీలవుతుంది. పగడాన్ని ధరిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడొచ్చు. ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యాపార వృద్ధి, లాభాలు, ఆర్థిక స్థిరత్వం కూడా పొందవచ్చు. పగడాలను ధరించేటప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవాలి.

ఈ రాశుల వారికి పగడం మంచిది

వృషభ రాశి, కుంభ రాశి, తులా రాశి వారు పగడాన్ని ధరించడం మంచిది కాదు. వీళ్లు ఎర్రటి పగడాలను ధరించడం వలన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe