ఈ రత్నాలను ధరిస్తే అప్పుల నుంచి బయటపడచ్చు.. ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంది!
మనం రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాము. కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అప్పులు వలన చాలా రకాలుగా సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ రత్నాలను ధరించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఏ రత్నాలను ధరించడం వలన అప్పుల నుంచి బయటపడొచ్చు?
చాలామంది రకరకాల రత్నాలను ధరిస్తారు. రత్నాలను ధరించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. రత్నశాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలు చాలా రకాల సమస్యల్ని తొలగిస్తాయి. మనం రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాము. కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అప్పులు వలన చాలా రకాలుగా సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ రత్నాలను ధరించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు.

రత్నశాస్త్రం ప్రకారం ఈ రత్నాలను ధరించడం వలన ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది, మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది. మరి ఎటువంటి రత్నాలను ధరించాలి? ఏ రత్నాలను ధరించడం వలన అప్పుల నుంచి బయటపడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రత్నాలను ధరిస్తే అప్పుల నుంచి బయటపడవచ్చు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి:
1.గార్నెట్:
ఈ రత్నాన్ని ధరించడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడవచ్చు. ఎలాంటి డబ్బు సమస్య రాదు. ఈ రత్నాన్ని ధరిస్తే రాహువు అప్పుల నుంచి ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆర్థిక లాభాలను పొందవచ్చు. హఠాత్తుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. పేదరికం నుంచి కూడా బయటపడవచ్చు.
2.ముత్యం:
ముత్యాన్ని ధరించడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి వీలవుతుంది. ఇది చంద్రుడి రత్నం. ఈ రత్నాన్ని ధరించడం వలన ఆర్థిక బాధలు ఉండవు. ధన లాభం కలుగుతుంది, మానసిక ఒత్తిడి తొలగిపోతుంది, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అప్పుల నుంచి రిలీఫ్ ఉంటుంది.
3.వజ్రం:
వజ్రాలను ధరించడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రత్నాన్ని ధరించడం వలన కెరీర్లో ఊహించని మార్పులు వస్తాయి. ఈ రత్నాన్ని ధరిస్తే సమాజంలో గౌరవమర్యాదలు కూడా పెరుగుతాయి. అప్పుల బాధల నుంచి సులువుగా బయటపడవచ్చు. ఈ రత్నాన్ని ధరించడం వలన ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. రత్నాన్ని ధరించినట్లయితే అప్పుల బాధలు కూడా తీరిపోతాయి, జీవితంలో సంతోషం ఉంటుంది.
4.నీలమణి:
నీలమణి రత్నాన్ని ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఇది ఏషియను రత్నం. దీనిని ధరించడం వలన కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు. అప్పుల నుంచి సులువుగా బయటపడొచ్చు. ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


