శివ మహాపురాణంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రుద్రాక్ష ధారణకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. రుద్రుని అనుగ్రహం పొందడానికి ఏ రకమైన రుद्राక్ష ధరించాలి, ఎలాంటి వాటిని అసలు వాడకూడదో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.

హిందూ ధర్మంలో రుద్రాక్షకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పాపాలను హరించి, భక్తులకు భోగభాగ్యాలను, మోక్షాన్ని ప్రసాదించే దివ్య స్వరూపంగా శివ భక్తులు దీనిని భావిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో లేదా శివారాధన సమయంలో చాలామంది భక్తులు భక్తిశ్రద్ధలతో రుద్రాక్షను ధరిస్తుంటారు. అయితే, దీనిని ఏ పద్ధతిలో ధరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే దానిపై శివ మహాపురాణంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. భక్తులు వీటిని విధిగా పాటించాలని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు.
రుద్రుని అనుగ్రహం
శివ మహాపురాణంలో తెలిపిన వివరాల ప్రకారం, రుద్రాక్ష పరిమాణాన్ని బట్టి దాని ఫలితాలు మారుతుంటాయి. సాధారణంగా రుద్రాక్ష ఎంత చిన్నదిగా ఉంటే అంతటి శుభఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరికాయంత పరిమాణం గల రుద్రాక్ష సమస్త విఘ్నాలను తొలగిస్తుందని విశ్వాసం.
రుద్రాక్షను ఎంచుకునేటప్పుడు దాని ఆకారం, సహజ సిద్ధంగా ఏర్పడిన రంధ్రం వంటి అంశాలను పరిశీలించాలి. ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా దానంతట అదే దారం వెళ్లేందుకు అనువుగా రంధ్రం ఉన్న రుద్రాక్ష అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు.
రుద్రాక్ష ధరించిన వారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు
రుద్రాక్షను కేవలం ఒక ఆభరణంగా కాకుండా పవిత్రమైన పూజా వస్తువుగా భావించాలి. దీనిని ధరించిన వారు కొన్ని కఠినమైన నియమాలను పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో ఎంతో నిగ్రహం అవసరం.
రుద్రాక్ష ధరించిన వారు మాంసాహారం జోలికి వెళ్లకూడదు. అలాగే, తామసిక ఆహార పదార్థాలైన ఉల్లిపాయ, వెల్లుల్లి, ములక్కాడ వంటి వాటికి దూరంగా ఉండాలని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నియమాలను పాటిస్తూ శివ నామస్మరణ చేయడం వల్ల పరిపూర్ణమైన ఆధ్యాత్మిక ఫలితాలు దక్కుతాయి.
ఎలాంటి రుద్రాక్షలను అస్సలు ధరించకూడదు?
మార్కెట్లో లభించే ప్రతి రుద్రాక్ష ధారణకు యోగ్యమైనది కాదు. కొన్ని ప్రత్యేక లక్షణాలు లేని వాటిని ధరిస్తే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పురుగులు తిన్నట్లుగా రంధ్రాలు పడినవి, విరిగిపోయినవి (ఖండితమైనవి), పగిలిన రుద్రాక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజకు లేదా ధారణకు ఉపయోగించకూడదు. అలాగే ముళ్లు లేనివి, పుండ్లు లేదా మచ్చలు ఉన్నవి, పూర్తి గోళాకారంలో లేని రుద్రాక్షలను పక్కన పెట్టేయాలి. ఎంతో ఆలోచించి, నిపుణుల సలహాతో నాణ్యమైన రుద్రాక్షను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
{{/usCountry}}మార్కెట్లో లభించే ప్రతి రుద్రాక్ష ధారణకు యోగ్యమైనది కాదు. కొన్ని ప్రత్యేక లక్షణాలు లేని వాటిని ధరిస్తే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పురుగులు తిన్నట్లుగా రంధ్రాలు పడినవి, విరిగిపోయినవి (ఖండితమైనవి), పగిలిన రుద్రాక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజకు లేదా ధారణకు ఉపయోగించకూడదు. అలాగే ముళ్లు లేనివి, పుండ్లు లేదా మచ్చలు ఉన్నవి, పూర్తి గోళాకారంలో లేని రుద్రాక్షలను పక్కన పెట్టేయాలి. ఎంతో ఆలోచించి, నిపుణుల సలహాతో నాణ్యమైన రుద్రాక్షను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.