దీపావళి నాడు సంసప్తక రాజయోగం, 4 రాశులకు అఖండ ధనయోగం.. అదృష్టమంటే ఈ రాశులదే!

కొన్ని గ్రహాల కలయిక శక్తివంతమైన యోగాలను ఏర్పరుస్తూ ఉంటుంది. అందులో ఏర్పడిన యోగం సంసప్తక యోగం. ఈ యోగం అక్టోబర్ 11న ఏర్పడింది. అక్టోబర్ 11న మీన రాశిలో ఉన్న శని ప్రత్యేక మార్పులు చేశాడు. దీంతో సంసప్తక రాజయోగం ఏర్పడింది. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా ఈ రాశి వారికి అందుతుంది.

Published on: Oct 16, 2025, 12:00:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. కొన్నిసార్లు కొన్ని గ్రహాల కలయిక శక్తివంతమైన యోగాలను ఏర్పరుస్తూ ఉంటుంది. అందులో ఏర్పడిన యోగం సంసప్తక యోగం. ఈ యోగం అక్టోబర్ 11న ఏర్పడింది. అక్టోబర్ 11న మీన రాశిలో ఉన్న శని ప్రత్యేక మార్పులు చేశాడు. దీంతో సంసప్తక రాజయోగం ఏర్పడింది.

సంసప్తక రాజయోగంతో ఈ మూడు రాశులకు అనేక లాభాలు (pinterest)
సంసప్తక రాజయోగంతో ఈ మూడు రాశులకు అనేక లాభాలు (pinterest)

సంసప్తక రాజయోగం

ఈ యోగం కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా కలిసి రాబోతోంది. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా ఈ రాశి వారికి అందుతుంది. 4 రాశుల వారు అఖండ రాజయోగాన్ని పొందుతారు. శని దేవుని ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆర్థిక పురోగతి లభించే అవకాశాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

సంసప్తక రాజయోగంతో ఈ 4 రాశులకు అనేక లాభాలు

1.మిథున రాశి:

మిథున రాశి వారికి సంసప్తక యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. శని దేవుని ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు. ఇది వరకు పెట్టుబడి పెట్టిన వాటి నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కెరీర్‌లో కూడా ఊహించని మార్పులు వస్తాయి. ఎప్పటినుంచో అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.

3.మకర రాశి:

మకర రాశి వారికి ఈ యోగం అదృష్టంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఇళ్ళు, భూములు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలను కూడా చేపడతారు. ఊహించని స్థాయిలో శ్రేయస్సు ఉంటుంది. ఈ జీవితంలో బాధలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు.

4.కుంభ రాశి:

కుంభ రాశి వారికి సంసప్తక యోగం బాగా కలిసి వస్తుంది. ఈ యోగం కారణంగా శని ప్రభావంతో ఆర్థిక పురోగతి లభించే అవకాశాలు ఉంటాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఇలా అనేక విధాలుగా ఈ రాశి వారు లాభాలను పొందుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More