సాముద్రిక శాస్త్రం ద్వారా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క పుట్టుమచ్చ వెనుక ఒక అర్థం ఉంటుంది. ఇవి చర్మంపై ఉన్న మచ్చలు మాత్రమే కాదు, ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వానికి అద్దం వంటివి. కొన్ని పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయి, కొన్ని తర్వాత ఏర్పడతాయి. అయితే మనం సాముద్రిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం అదృష్టానికి సంకేతం.

ఆర్థికపరంగా కూడా బావుంటుందని తెలుపుతాయి. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే నిజంగా అదృష్టం వరించినట్లే. సంతోషం, సంపదతో కలకాలం ఉండొచ్చు. మరి ఏ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే సంపదతో ఆనందంగా ఉండొచ్చో తెలుసుకుందాం.
ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే కుబేరుడు అంత ధనవంతులు అవ్వచ్చు
1.నుదుటిపై పుట్టుమచ్చ
ఎవరికైనా నుదుటిపై కుడి వైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే, అది చాలా శుభప్రదమైనదిగా భావించాలి. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా తెలివైన వారు. పైగా కష్టపడి పనిచేస్తారు. ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నవారికి ఎప్పుడూ డబ్బు కొరత కూడా రాదు. సమాజంలో గౌరవం, మర్యాదలు కూడా లభిస్తాయి.
2.మెడపై పుట్టుమచ్చ
ఎవరికైనా మెడ వద్ద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి రాజయోగమే. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మంచి పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నవారు బాగా మాట్లాడగలరు. అలాగే ఎంతో శక్తివంతమైన వారు. ఎప్పుడూ కూడా ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారికి ఆర్థిక కొరత రాదు. ఆనందంగా ఉంటారు. సంపదకి లోటు ఉండదు.
3.బొడ్డు దగ్గర పుట్టుమచ్చ
ఎవరికైనా బొడ్డు దగ్గర పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వరించినట్లు అర్థం చేసుకోవాలి. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నవారు మంచి, రుచికరమైన ఆహార పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారికి డబ్బు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.
4.ముక్కు దగ్గర పుట్టుమచ్చ
{{/usCountry}}ఎవరికైనా బొడ్డు దగ్గర పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వరించినట్లు అర్థం చేసుకోవాలి. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నవారు మంచి, రుచికరమైన ఆహార పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారికి డబ్బు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.
4.ముక్కు దగ్గర పుట్టుమచ్చ
{{/usCountry}}ఎవరికైనా ముక్కు కుడి వైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులు. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అదృష్టం కలిసి వస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. అలాగే ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారికి ఎప్పుడూ డబ్బు కొరత కూడా రాదు. ఆనందంగా ఉంటారు.
5.కుడి అరచేతిపై పుట్టుమచ్చ
సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి అరచేతిపై పుట్టుమచ్చ ఉన్న వారిని కూడా స్పెషల్‌గా భావించాలి. ముఖ్యంగా కుడి అరచేతి పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే డబ్బుకు లోటు ఉండదు. సంతోషానికి కొదవ ఉండదు. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటారు.