సంకష్ట చతుర్థి జూలై 2026: తేదీ, పూజా విధానం, శుభ సమయాలు, పఠించాల్సిన వినాయక శ్లోకాలు!

సంకష్ట చతుర్థి సందర్భంగా జూలై 3, 2026న శ్రీ గణేశుడిని ఎలా పూజించాలి? చతుర్థి తిథి, చంద్రోదయ సమయం, ఉపవాస నియమాలు, పూజా విధానం, జపించాల్సిన గణేశ మంత్రాలు, పఠించాల్సిన ప్రసిద్ధ వినాయక శ్లోకాలతో పాటు ఈ పవిత్ర వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

Published on: Jul 1, 2026, 14:00:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విఘ్నాలను తొలగించే దేవుడిగా వినాయకుడిని భావిస్తారు. వినాయకుడిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. హిందూ ధర్మంలో విఘ్నాలను తొలగించే దేవుడిగా గణేశుడిని భావించి, ఏ శుభకార్యాన్ని అయినా మొదలుపెట్టే ముందు వినాయకుడిని పూజించడం ఆనవాయితీ.

సంకష్ట చతుర్థి జూలై 2026: తేదీ, పూజా విధానం, శుభ సమయాలు, పఠించాల్సిన వినాయక శ్లోకాలు! (pinterest)
సంకష్ట చతుర్థి జూలై 2026: తేదీ, పూజా విధానం, శుభ సమయాలు, పఠించాల్సిన వినాయక శ్లోకాలు! (pinterest)

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్ష చవితి నాడు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాము. ఆషాఢ మాసంలో కృష్ణపక్ష సంకష్ట చతుర్థి జూలై 3న వచ్చింది. ఆ రోజు భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి వినాయకుడిని ఆరాధిస్తే జీవితంలో కష్టాలు తొలగిపోయి, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.

సంకష్ట చతుర్థి జూలై 2026: తేదీ, శుభ సమయాలు

చతుర్థి ప్రారంభం: జూలై 3, ఉదయం 11:21 గంటలకు.

చతుర్థి ముగింపు: జూలై 4, మధ్యాహ్నం 12:40 గంటలకు.

చంద్రోదయం: రాత్రి 9:51 గంటలకు. (ప్రాంతాన్ని బట్టి ఈ సమయంలో స్వల్ప మార్పులు ఉండొచ్చు)

సంకష్ట చతుర్థి వ్రతంలో రాత్రి చంద్రుని దర్శించి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

సంకష్ట చతుర్థి నాడు ఏం చెయ్యాలి?

సంకష్ట చతుర్థి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించాలి.

చేతిలో నీరు తీసుకుని, గణేశుడు సాక్షిగా ఉపవాస సంకల్పం చెప్పుకోవాలి.

ఈ రోజంతా పండ్లు తింటూ, శక్తి, విశ్వాసానికి అనుగుణంగా ఉపవాసాన్ని పాటించాలి.

పూజా స్థలంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఎర్రటి పూలు, అక్షింతలు, గంధం, గరికను సమర్పించాలి.

బూందీ లడ్డులు వంటి నైవేద్యాలను సమర్పించాలి.

ఆ తర్వాత "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని జపించాలి.

సంకష్ట చతుర్థి వ్రత కథను చదివినా, విన్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

చివరగా వినాయకుడికి హారతి ఇవ్వాలి.

చంద్రోదయం తర్వాత రాత్రి చంద్రుడికి నీరు, పాలు అర్ఘ్యంగా సమర్పించి పూజ చేసుకోవాలి.

చంద్ర దర్శనం పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమించాలి.

ఈ వినాయక శ్లోకాలను చదువుకోండి

గజాననం భూతగణాదిసేవితం

కపిత్థ జంబూ ఫలసార భక్షితం

ఉమాసుతం శోకవినాశ కారణం

నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్..

గణానాం త్వా గణపతిం హవామహే

కవిం కవీనాముపమశ్రవస్తమమ్

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత

ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం..

వక్రతుండ మహాకాయ

సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవ

సర్వకార్యేషు సర్వదా..

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More