...
...
Next Story

Sankatahara Chaturthi: ఈరోజు గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. 9 లేదా 11 సార్లు ఈ స్తోత్రం చదవండి.. ఇదే ఉత్తమ మార్గం!

సంకటహర చతుర్థి 2026 సందర్భంగా శ్రవణ నక్షత్రం, శుక్రవారం విశేష యోగంలో సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోండి. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు, ఎన్ని సార్లు చదవాలి? 'ఓం గం గణపతయే నమః' మంత్ర జపం విశిష్టత ఏమిటో పూర్తి వివరాలు చదవండి.

Published on: Jul 3, 2026, 09:25:50 IST
Advertisement

ఈరోజు ఎంతో విశేషమైన సంకటహర చతుర్థి. పైగా శుక్రవారం, విష్ణువుకు ప్రీతికరమైన శ్రవణ నక్షత్రం కలిసి రావడం మరింత విశేషం. ఈరోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. దాంతో పాటుగా వినాయకుడి శ్లోకాలు, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవడం వలన మరింత ఫలితం ఉంటుంది.

వినాయక అనుగ్రహం ఉంటే విఘ్నాలు తొలగిపోతాయి

ఈరోజు గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. 9 లేదా 11 సార్లు ఈ స్తోత్రం చదవండి.. ఇదే ఉత్తమ మార్గం! (pinterest)
ఈరోజు గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. 9 లేదా 11 సార్లు ఈ స్తోత్రం చదవండి.. ఇదే ఉత్తమ మార్గం! (pinterest)

వినాయకుడి ఆశీస్సులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవ్వాలన్నా సంకటనాశన గణేశ స్తోత్రం ఈరోజు చదువుకోండి. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం.

ఈ స్తోత్రాన్ని ఈరోజు 9 లేదా 11 సార్లు చదివితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ అన్ని సార్లు చదవడానికి సమయం లేకపోతే, ఒక్కసారైనా చదువుకోండి లేదా వినండి. గణేశుని అనుగ్రహం పొందడానికి ఇది అద్భుతమైన మార్గం.

సంకటనాశన గణేశ స్తోత్రం

శ్రీ గణేశాయ నమః

నారద ఉవాచ

ప్రణమ్య శిరసా దేవం

గౌరీపుత్రం వినాయకమ్।

భక్తావాసం స్మరేన్నిత్యం

ఆయుః కామార్థ సిద్ధయే॥

ప్రథమం వక్రతుండం చ

ఏకదంతం ద్వితీయకం।

తృతీయం కృష్ణపింగాక్షం

గజవక్త్రం చతుర్థకం॥

లంబోదరం పంచమం చ

షష్ఠం వికటమేవ చ।

సప్తమం విఘ్నరాజం చ

ధూమ్రవర్ణం తథాష్టమమ్॥

నవమం భాలచంద్రం చ

దశమం తు వినాయకమ్।

ఏకాదశం గణపతిం

ద్వాదశం తు గజాననం॥

ద్వాదశైతాని నామాని

త్రిసంధ్యం యః పఠేన్నరః।

న చ విఘ్నభయం తస్య

సర్వసిద్ధికరం పరమ్॥

విద్యార్థీ లభతే విద్యాం

ధనార్థీ లభతే ధనం।

పుత్రార్థీ లభతే పుత్రాన్

జపేత్ గణపతి స్తోత్రం

షడ్భిర్మాసైః ఫలం లభేత్।

సంవత్సరేణ సిద్ధిం చ

లభతే నాత్ర సంశయః॥

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ

లిఖిత్వా యః సమర్పయేత్।

తస్య విద్యా భవేత్ సర్వా

గణేశస్య ప్రసాదతః॥

ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణమ్..

ఎప్పుడు చదువుకోవచ్చు?

సంకటనాశన గణేశ స్తోత్రం ఈరోజే కాదు, ప్రతిరోజూ కూడా చదువుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యా కాలంలో కూడా చదువుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని చదువుకుంటే విఘ్నాలు తొలగి, ధనం, సంతానం, విద్య, శుభకార్య సిద్ధి, ఐశ్వర్యంతో పాటు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలను పొందవచ్చు. ''ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపిస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks