...
...
Next Story

శనివారం చదువుకోవాల్సిన శని శ్లోకాలు, శని స్తోత్రం, శని దోష నివారణ పరిహారాలు!

శనివారం శని దేవాలయంలో లేదా ఇంట్లో అయినా సరే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం ఉపవాసం ఉంటే శని అనుగ్రహాన్ని పొందవచ్చు. “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన శని అనుగ్రహం కలుగుతుంది. శని దోష నివారణ పరిహారాలు, శని స్తోత్రం దశరథ కృతం తెలుసుకోండి.

Published on: Mar 21, 2026, 08:00:25 IST
Advertisement

శని శ్లోకాలు

శని శ్లోకాలు (pinterest)
శని శ్లోకాలు (pinterest)

1. శని బీజ మంత్రం

ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః

2. శని ధ్యాన శ్లోకం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

3. శని కవచం

శనైశ్చరః శిరో రక్షేత్ ముఖం భక్తార్థినాశనః

కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః

4. శని గాయత్రి మంత్రం

ఓం కకుద్వహాయ విద్యమహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్

5. శని అష్టక ప్రారంభ శ్లోకం

నమః కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ

నమః కాలాగ్నిరూపాయ కృతాంతాయ చ వై నమః

6. శని దోష నివారణ శ్లోకం

ఓం శంనో దేవీ రభిష్టయే ఆపో భవంతు పీతయే శంయోరభి స్రవంతునః

శనివారం పూజా విధానం:

  • శనివారం నాడు ఈ శ్లోకాలను జపిస్తే మంచిది.
  • నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది.
  • నల్ల నువ్వులను శనివారం దానం చేయడం శ్రేయస్కరం.
  • ఈ శ్లోకాలను భక్తితో జపిస్తే శని దోషాలు తగ్గిపోతాయి, శుభ ఫలితాలు పొందుతారు.

శని దోష నివారణ పరిహారాలు

నువ్వుల నూనెతో దీపం

శనివారం శని దేవాలయంలో లేదా ఇంట్లో అయినా సరే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.

శనివారం నాడు ఉపవాసం

శనివారం ఉపవాసం ఉంటే శని అనుగ్రహాన్ని పొందవచ్చు.

నల్ల నువ్వులను దానం చేయండి

నల్ల నువ్వులు, నల్ల బట్టలు వంటివి ఈరోజు పేదలకు దానం చేయడం మంచిది.

శని మంత్ర జపం

“ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన శని అనుగ్రహం కలుగుతుంది.

కాకులకు ఆహారం

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ

నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ

నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః

నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే

నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః

నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తు తే

సూర్యపుత్త్ర నమస్తేస్తు భాస్వరోభయదాయినే

అధోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తు తే

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః

తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ

జ్ఞానచక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే

తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్

దేవాసుర మనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః

త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః

రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యావలోకితః

త్వయావలోకితాస్తేపి నాశం యాంతి సమూలతః

ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks