శని నక్షత్ర మార్పు - అక్టోబర్ 9 నుంచి ఈ 4 రాశుల జాతకం మారబోతోంది!

అక్టోబర్ 9న శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. తదుపరి 122 రోజుల పాటు వృషభం, కన్య, తులా, మకర రాశుల వారికి ఆర్థిక వృద్ధి, ఉద్యోగంలో పురోగతి లభించనుంది.

Published on: Oct 3, 2026, 15:45:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కర్మఫల ప్రదాత, న్యాయ దేవుడైన శనిదేవుని సంచారంలో త్వరలోనే ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుతం బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో ఉన్న శనిదేవుడు…. అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 7:28 గంటలకు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో శని నక్షత్ర మార్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆయన వేగంలో లేదా రాశి, నక్షత్ర మార్పుల్లో ఏ చిన్న వ్యత్యాసం వచ్చినా, అది ద్వాదశ రాశుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

శని నక్షత్ర మార్పు
శని నక్షత్ర మార్పు

రాబోయే 122 రోజుల పాటు శనిదేవుడు ఇదే ఉత్తరాభాద్ర నక్షత్రంలో కొనసాగి, 2027 ఫిబ్రవరి 8 వరకు అక్కడ నివసించనున్నాడు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. ఈ సుదీర్ఘ నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం వరించనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శనిదేవుని అనుగ్రహంతో నిలిచిపోయిన పనులు పూర్తవ్వడమే కాకుండా, ఆర్థిక పురోగతి లభిస్తుంది.

వృషభ రాశి:

శని నక్షత్ర పరివర్తనం వృషభ రాశి వారికి అపారమైన ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. శనిదేవుడు ఫలితాలను ఇవ్వడంలో ఆలస్యం చేసినప్పటికీ, ఇచ్చేటప్పుడు మాత్రం కొదవలేకుండా ఇస్తారని పండితులు చెబుతుంటారు. ఉద్యోగంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు అందుతాయి. పాత పెట్టుబడుల నుంచి ఊహించని రీతిలో మంచి రాబడి వచ్చి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

కన్యా రాశి:

కన్యా రాశి వారికి శని మార్పు వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. కార్యాలయంలో బాధ్యతలు పెరిగి, పని ఒత్తిడి అనిపించినప్పటికీ, చివరికి అది మీకే పెద్ద ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలసివచ్చి వ్యాపారం విస్తరిస్తుంది. ధన సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది.

తులా రాశి:

తులా రాశి వారి కెరీర్‌లో ఈ నక్షత్ర మార్పు ఒక సానుకూల మలుపును తీసుకొస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుత ఆఫీసులోనే సరికొత్త బాధ్యతలు లేదా పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. మీ పనితీరుతో పై అధికారులు, సీనియర్లు ఎంతో సంతృప్తి చెందుతారు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు.

మకర రాశి:

మకర రాశికి అధిపతి శనిదేవుడే కావడంతో…. ఈ జ్యోతిష్య సంఘటన ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఆశించిన ఎదుగుదల కనిపిస్తుంది, వేతనాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణకు కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అయితే, ఈ సమయంలో తొందరపడి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More