శని సంచారం 2027 : మేషరాశిలోకి శని గ్రహం - ఈ 4 రాశుల జీవితాల్లో కీలక మార్పులు!

2027లో శని దేవుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించనున్నారు. జూన్ 3న జరిగే ఈ సంచారంతో పాటు అక్టోబర్ 20న తిరోగమనం వల్ల 4 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారనున్నాయి.

Published on: Oct 2, 2026, 19:59:06 IST
By , नई दिल्ली
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. మానవుల కర్మలకు తగిన ప్రతిఫలాన్ని ప్రదానం చేసే న్యాయాధిపతిగా, క్రమశిక్షణ మరియు బాధ్యతలకు సంకేతంగా శని గ్రహాన్ని పరిగణిస్తారు. నవగ్రహాలలో కెల్లా అత్యంత నెమ్మదిగా కదిలే శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి దాదాపు రెండేళ్లన్నర సమయం తీసుకుంటాడు. అందుకే శని సంచారం లేదా గోచార ప్రభావం వ్యక్తిగత జీవితాలపైనా, సమాజంపైనా చాలా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది.

మేషరాశిలోకి శని గ్రహం
మేషరాశిలోకి శని గ్రహం

గ్రహాల గణన ప్రకారం 2027 సంవత్సరం శని సంచారంలో అత్యంత కీలకమైన మలుపు కానుంది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శనిదేవుడు…. 2027 జూన్ 3న మీనాన్ని వీడి మేషరాశిలోకి ప్రవేశించనున్నారు. ప్రవేశ సమయంలో ఆయన అశ్విని నక్షత్రంలోకి అడుగుపెడతారు. అయితే మేషంలో శని ప్రవేశం శాశ్వతం కాదు. మేషరాశిలో సంచరించిన అనంతరం, వక్రగతి (తిరోగమనం) పట్టి మళ్లీ వెనక్కి వస్తారు. పంచాంగ గణనాల ప్రకారం 2027 అక్టోబర్ 20న శనిదేవుడు తిరోగమనంలో మళ్లీ మీన రాశికి చేరుకుంటారు.

ఈ విధంగా 2027లో జూన్ 3న మేష రాశి ప్రవేశం, అక్టోబర్ 20న తిరిగి మీనరాశికి రావడం జ్యోతిష్య రీత్యా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శనిదేవుడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ రంగానికి సంబంధించిన విషయాల్లో మనిషి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. శ్రమ, నిరంతర సాధన, ఓర్పుతో వ్యవహరిస్తేనే శని అనుగ్రహం లభిస్తుంది. ఈ నక్షత్ర, రాశి పరివర్తనాల వల్ల ప్రధానంగా నాలుగు రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి.

మేష రాశి:

శనిదేవుడు నేరుగా మీ రాశిలోనే సంచరించనుండటంతో మీపై బాధ్యతల భారం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి కఠినంగా శ్రమించాల్సి వస్తుంది. క్రమశిక్షణతో అడుగులు వేస్తేనే అను అనుకూల ఫలితాలు అందుతాయి.

మిథున రాశి:

మిథున రాశి వారికి కెరీర్, ఉద్యోగ రంగాల్లో పెద్ద ఎత్తున మార్పులు చూసే సమయం ఇది. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారు లేదా ఉద్యోగం మారాలనుకునే వారు ప్రతీ నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవాలి. ఆలోచనాత్మకంగా వేసే అడుగులు మంచి పురోగతిని ఇస్తాయి.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారి వృత్తిపరమైన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. మీరు గతంలో వేసుకున్న ప్రణాళికలను పునఃసమీక్షించుకుని, కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సహనం, ఓర్పు ప్రదర్శించడం వల్ల భవిష్యత్తులో అమితమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

కుంభ రాశి:

కుంభ రాశికి అధిపతి స్వయంగా శనిదేవుడే. కాబట్టి ఈ రాశి వారికి ఈ గోచారం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో తీవ్రమైన క్రమశిక్షణ వహించాలి. ఆదాయం ఎంత వస్తున్నప్పటికీ…. దానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. అనాలోచిత ఖర్చులకు అడ్డుకట్ట వేస్తేనే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More