అక్టోబర్‌లో గ్రహాల గమనం వేగం.. ఈ 6 రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు!
అక్టోబర్ 2026 జ్యోతిష్య పరంగా కీలక గ్రహచలనాలతో కూడిన నెలగా నిలవనుంది. వైదిక జ్యోతిష్య లెక్కల ప్రకారం అక్టోబర్ 3న శుక్రుడు తిరోగమనం, అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి, అక్టోబర్ 24న బుధుడు తిరోగమనం, అక్టోబర్ 31న గురుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు
జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ 2026 నెల అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నెల ప్రారంభం నుంచే ఖగోళంలో కీలక గ్రహాల గమనం వేగంగా మారనుంది. అక్టోబర్ 3న శుక్రుడు తిరోగమనం చెందనుండగా, అక్టోబర్ 17న సూర్య భగవానుడు తులా రాశిలోకి అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 24న బుధుడు తిరోగమనం మొదలుపెట్టగా, నెల చివరి రోజున అంటే అక్టోబర్ 31న దేవగురు బృహస్పతి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ గ్రహ మార్పుల ప్రభావం పన్నెండు రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఆరు రాశుల వారికి మాత్రం ఈ ముప్పై రోజులు ఎంతో కీలకమని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మేష రాశి:
మేష రాశి జాతకులకు అక్టోబర్ నెల పని ప్రదేశంలో సరికొత్త అవకాశాలను తెస్తుంది. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరగడంతో పాటు, గతంలో నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభసాటిగా మారుతాయి. పాత క్లయింట్ల నుంచి మళ్లీ ఆర్డర్లు అందే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి బడ్జెట్ నియంత్రణ ముఖ్యం. ప్రేమ జీవితంలో చిన్నపాటి అపార్థాలు తొలగిపోయి బంధం బలపడుతుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగస్తుల కష్టాన్ని గుర్తించిన పైఅధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు దక్కడంతో పాటు ఆగిపోయిన పాత బకాయిలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ మాసంలో నూతన పరిచయాలు, సామాజిక సంబంధాలు విస్తృస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా కీలక ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత మీపై పడుతుంది. వ్యాపారంలో సరైన సంప్రదింపుల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం కనిపిస్తుంది. పాత పెట్టుబడుల ద్వారా మంచి వార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి జాతకులకు ఈ ముప్పై రోజులు వృత్తి పరంగా సానుకూల వాతావరణాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త హోదా లభించే సూచనలున్నాయి. వ్యాపారస్తులకు పాత నెట్‌వర్క్ ద్వారా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందడంతో ఆర్థిక భారం తగ్గుతుంది. కుటుంబంలో ఒకరి విజయంతో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ నెల ప్రత్యేకంగా నిలవనుంది. నెల చివరి రోజున గురువు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు. సృజనాత్మక రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది.
తులా రాశి:
తులా రాశి వారికి సూర్య సంచారం వల్ల నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు విలువ ఇస్తారు. వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగువేయడం ఉత్తమం. ప్రేమ బంధంలో స్పష్టత ఉండటం చాలా అవసరం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


