రేవతి నక్షత్రంలో శని: మూడు రాశులకు శుభదినాలు.. శని సంచారంతో ఎన్నో ఊహించని లాభాలు!

అన్ని గ్రహాల మాదిరిగానే శని కూడా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. శని సంచారంలో మార్పు వచ్చినప్పుడు సమస్యలు, సంతోషాలు రెండూ కలుగుతూ ఉంటాయి. త్వరలోనే శని రేవతి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది.

Published on: Feb 08, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది ద్వాదశ రాశుల వారి జీవితాల్లో కూడా మార్పులను తీసుకొస్తుంది. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి శని ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రేవతి నక్షత్రంలో శని: మూడు రాశులకు శుభదినాలు (pinterest)
రేవతి నక్షత్రంలో శని: మూడు రాశులకు శుభదినాలు (pinterest)

అన్ని గ్రహాల మాదిరిగానే శని కూడా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. శని సంచారంలో మార్పు వచ్చినప్పుడు సమస్యలు, సంతోషాలు రెండూ కలుగుతూ ఉంటాయి. త్వరలోనే శని రేవతి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది.

రేవతి నక్షత్రంలోకి శని

మే 17న మధ్యాహ్నం 3:49కి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుని నక్షత్రంలోకి శని ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటారు.

రేవతి నక్షత్రంలోకి శని అడుగు పెట్టడంతో 3 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. ఎక్కువ లాభాలను పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలను పొందబోతున్నారు? ఎవరికి ఎలా లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులకు ఊహించని లాభాలు, శని సంచారంతో అద్భుతాలే

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది ప్రయోజనకరంగా మారబోతోంది. శని రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పురోగతిని చూస్తారు. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. అత్తింటి వారి నుంచి శుభవార్తలను వింటారు. పాజిటివ్‌గా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సంచారం అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ ప్రణాళికలను బట్టి ఎక్కువ లాభాలు వస్తాయి. కమ్యూనికేషన్స్ మెరుగుపడతాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు.

3.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. శని నక్షత్ర సంచారంతో ఈ రాశి వారు ఊహించని మార్పులను పొందుతారు. పెద్ద సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ఉద్యోగం లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.