కొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారి లైఫ్ మారిపోతుంది, నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పుతో ఐదు రాజయోగాలు!
గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీంతో ఐదు రాజయోగాలు ఏర్పడతాయి. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీంతో ఐదు రాజయోగాలు ఏర్పడతాయి. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.

ఫిబ్రవరి నెలలో ఈ రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అభివృద్ధిని చూస్తారు.
ఫిబ్రవరి నెలలో నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు, ఐదు రాజయోగాలు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
ఫిబ్రవరి 3న బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 6న శుక్రుడు రాశి మార్పు చేస్తాడు. ఫిబ్రవరి 23న కుజుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రధాన గ్రహాల సంచార మార్పుల కారణంగా చతుర్‌గ్రహీ యోగం ఏర్పడుతుంది.
అలాగే లక్ష్మీ నారాయణ యోగం, శుక్రాదిత్య రాజయోగం, ఆదిత్య కుజ రాజయోగం కూడా ఏర్పడతాయి. ఈ రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారు సక్సెస్‌ను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవకాశాలు లభిస్తాయి. ప్రధాన గ్రహాల సంచారంతో అద్భుతమైన రాజయోగాలు ఏర్పడి కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుంది.
మేష రాశి
మేష రాశి వారికి ఫిబ్రవరి 2026లో కలిగే రాజయోగాలు శుభ ఫలితాలను తీసుకొస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికపరంగా మంచి లాభాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది శుభసమయం. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. బిజినెస్ చేసేవారికి కూడా ఇది శుభసమయం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రాజయోగాలు అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయి. కన్యా రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మరియు వాటిని అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారు కూడా ఈ గ్రహ సంచారంతో శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రాజయోగాలు అద్భుతమైన మార్పులను తీసుకొస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో సక్సెస్‌ను చూస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


