త్వరలో శని, శుక్రుల సంయోగం, ఈ నాలుగు రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బు, ఆనందం, ఉద్యోగాలు, అందమైన ప్రేమ జీవితం ఇలా ఎన్నో!
శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. 12 రోజులు వారిపై ప్రభావం పడినా, కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. మరి శని, శుక్రుల సంయోగం ఎప్పుడు చోటు చేసుకోబోతోంది? ఆ అదృష్ట రాశులు ఎవరు?
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. 12 రోజులు వారిపై ప్రభావం పడినా, కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు.

మరి శని, శుక్రుల సంయోగం ఎప్పుడు చోటు చేసుకోబోతోంది? ఆ అదృష్ట రాశులు ఎవరు? వారి జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 మార్చిలో శని, శుక్రుల సంయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక లాభాలు ఇస్తుంది.
శని, శుక్రుల సంయోగం 2026
మార్చి 29, 2025న శని కుంభ రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 3, 2027 వరకు ఇదే రాశిలో కొనసాగిస్తాడు. శుక్రుడు మార్చి 26న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. మార్చి 2 నుంచి మార్చి 26 వరకు ఈ రెండిటి సంయోగం ఉంటుంది. దీంతో నాలుగు రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
శని, శుక్రుల సంయోగంతో ఈ రాశులకు ఊహించని లాభాలు
1.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం భారీగా లాభాలను కలిగిస్తుంది. పిల్లల జీవితంలో పురోగతి ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. సమస్యలన్నీ తొలగిపోతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి.
2.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం అద్భుతమైన లాభాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. కెరీర్‌లో కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. పనికి సంబంధించి ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
3.తులా రాశి
తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ రెండు గ్రహాల కలయిక ఈ రాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ప్రశాంతంగా ఉంటారు. పాత ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం.
4.మకర రాశి
మకర రాశి వారికి ఇది చాలా శుభ సమయం. ఈ సమయంలో ఈ రెండు గ్రహాల కలయికతో అనేక లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు ఉంటాయి. వ్యాపారవేత్తలకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆనందంగా ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


