...
...
Next Story

శని దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే శనివారం నాడు ఇలా చేస్తే మంచిది!

శని దేవుడు కర్మఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శని దోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే శని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అనుకుంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం మంచిది.

Published on: Nov 29, 2025, 08:00:03 IST
Advertisement

ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని, శని బాధల నుంచి బయట పడాలని అనుకుంటారు. శని దేవుడు కర్మఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శని దోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే శని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అనుకుంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం మంచిది.

శని దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే శనివారం నాడు ఇలా చేస్తే మంచిది (pinterest)
శని దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే శనివారం నాడు ఇలా చేస్తే మంచిది (pinterest)

శనివారం నాడు ఇలా చేస్తే శని దేవుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. శనివారం నాడు శని దేవుని ఆలయానికి వెళ్లి శని దేవుని ఆరాధించాలి. నెయ్యితో దీపారాధన చేసి, నల్ల నువ్వులను సమర్పించాలి. శనివారం శని మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే శని దోష బాధల నుంచి బయటపడడానికి వీలవుతుంది.

శనివారం నాడు దానం:

శనివారం నాడు ఆహారం, వస్త్రాలు, ధనం వంటి వాటిని దానం చేస్తే శని దేవుని అనుగ్రహం కలిగి శని దేవుడిని సంతోషపరచచ్చు. అనుగ్రహం కలగాలంటే నల్ల దుస్తులు, శనగపిండి, నువ్వులు, నెయ్యి లాంటి వస్తువులను దానం చేయడం మంచిది.

శివుడు, హనుమంతుడు:

శని దోషం తొలగిపోవడానికి శివుడు, హనుమంతుడిని ఆరాధించాలి. శివుని లింగరూపానికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు పాలను కూడా సమర్పించండి. శనివారం నాడు హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేస్తే శని గ్రహం శాంతించి శని అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

శని దోషం తగ్గడానికి ఈ ప్రత్యేక పద్ధతులను కూడా పాటించొచ్చు:

  • శనివారం నాడు శని దోషం తగ్గడానికి కాకులకు అన్నం, పప్పు పెట్టండి. అలాగే ఆలయంలో నవగ్రహ పూజలు చేయించడం, సుందరాకాండ పారాయణం, హనుమాన్ భజనలు వంటివి చేస్తే మంచిది.
  • శనివారం ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటే మంచిది.
  • "ఓం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. బాధలు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతను కూడా పొందడానికి వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks